
ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో జనాలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. డాన్సులు, స్టంట్స్, సాహసాలు, సరసాలు..అబ్బో.. నెట్టింట చేరేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు చేస్తున్నారు. వీటిలో వివాహ వేడుకలు ప్రత్యేకమని చెప్పుకోవాలి. పెళ్లిళ్లలో సరదా సన్నివేశాలకు కొదవే ఉండదు. పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. అయితే కొందరు ఒకడుగు ముందుకేసి తమ పెంపుడు జంతువులకు పెళ్లిళ్లు చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించారు వాటి యజమానులు. అంతేకాదు ఇరుగు పొరుగువాళ్లు, బంధువుల పెంపుడు కుక్కలను ఈ వివాహానికి ఆహ్వానించి మంచి విందుకూడా ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. టామీ అనే వరుడి శునకానికి, జెల్లీ అనే శునక వధువునిచ్చి జనవరి 14న వైభవంగా వివాహం జరిపించారు. అంతేకాదు, అట్రౌలీలోని తిక్రి రాయ్‌పూర్ నుంచి వరుడి శునకాన్ని తీసుకొని కుటుంబమంతా ఊరేగింపుగా అలీగఢ్‌లోని వధువు శునకం గ్రామం సుఖ్రావలికి చేరుకున్నారు. బ్యాండ్ మేళాలు, డీజే మోతలతో డాన్సులు చేసుకుంటూ మరీ వధువు ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఘనంగా పెద్దలందరి సమక్షంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత నెయ్యితో తయారు చేసిన వంటకాలను కొత్త దంపతులైన కుక్కల జంటకు వడ్డించారు. ఆ ప్రాంతంలోని పొరుగింటి కుక్కలకు కూడా విందు ఇచ్చారు.
ఆ తర్వాత వీడ్కోలు కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ శునక వివాహానికి గాను దాదాపు 45 వేల రూపాయల వరకూ ఖర్చుచేసినట్లు టామీ యజమాని చెప్పాడు. ఇప్పుడు ఈ కుక్కల పెళ్లి వీడియో నెట్టింట చేరి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..