Viral Video: వీడు మహాముదురు.. స్టేడియంలో మందు కొట్టేందుకు ఎలాంటి ప్లాన్‌ వేశాడో తెలిస్తే అవాక్కవుతారు

|

Sep 14, 2022 | 7:15 PM

Funny Video: సాధారణంగా క్రీడా మైదానాల్లో మద్యం తాగేందుకు కానీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే కొందరు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మద్యం బాటిళ్లను స్టేడియంలోకి తీసుకెళుతుంటారు. అందుకోసం ఎన్నో ప్లాన్లు, ఐడియాలు వేస్తుంటారు.

Viral Video: వీడు మహాముదురు.. స్టేడియంలో మందు కొట్టేందుకు ఎలాంటి ప్లాన్‌ వేశాడో తెలిస్తే అవాక్కవుతారు
Liquor Bottle
Follow us on

Funny Video: సాధారణంగా క్రీడా మైదానాల్లో మద్యం తాగేందుకు కానీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే కొందరు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మద్యం బాటిళ్లను స్టేడియంలోకి తీసుకెళుతుంటారు. అందుకోసం ఎన్నో ప్లాన్లు, ఐడియాలు వేస్తుంటారు. అవి ఒక్కోసారి వర్కవుట్‌ అవుతుంటాయి. మరికొన్ని సార్లు ఫెయిలవుతుంటాయి. అయితే ఒక క్రీడాభిమాని మందు కొడుతూ మ్యాచ్‌ చూడాలనుకున్నాడు. అయితే స్టేడియంలోకి మందుకు పర్మిషన్‌ లేకపోవడంతో ఓ తెలివైన ప్లాన్‌ వేశాడు. ఏకంగా శాండ్‌విచ్‌లో తనకిష్టమైన మందు బాటిల్‌ను దాచిపెట్టుకుని వెళ్లిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది కూడా దానిని పసిగట్టలేకపోయారు. ఇక స్టేడియంలోకి వెళ్లిన అతను తనకు కేటాయించిన కుర్చీలో కులాసాగా కూర్చున్నాడు. వెంట తీసుకువచ్చిన శాండ్‌విచ్‌ అదేనండి మందు బాటిల్‌ను ఓపెన్‌ చేశాడు.

ముందుగా శాండ్‌విచ్‌పై ఉన్న బ్రెడ్‌ను తీసేశాడు. ఆ తర్వాత మందుబాటిల్‌ కనిపించకుండా ఉండేందుకు కవర్‌ చేసిన ఆకులను కూడా తీసేశాడు. ఎంచెక్కా మందు బాటిల్ ఓపెన్‌ చేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరలవుతోంది. Unexpected Videos అనే ట్విట్టర్‌ ఐడీతో షేర్‌ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘మందు కోసం ఇన్ని తంటాలు పడాలా’ అని కొందరు స్పందిస్తుంటే, ‘ వీడి తెలివికి జోహార్లు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..