Shocking Video: అమ్మ బాబోయ్..! సీలింగ్ ఫ్యాన్‌ని చుట్టేసుకున్న పాము.. ఒల్లు జలదరించేలా మీదకు దూకి..

Shocking Video: చాలా మంది పామును చూస్తేనే వణికిపోతారు. అలాంటిది పాము మీద పడితే.. పైప్రాణాలు పైకే పోతాయి కదా. పాములకు సంబంధించి అనేక వీడియోలను చూసే ఉంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మీకు కూడా ఒల్లు జల్లుమంటుంది. అవును, ఆ వీడియోలో ఓ పాము గదిలో తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్‌ని..

Shocking Video: అమ్మ బాబోయ్..! సీలింగ్ ఫ్యాన్‌ని చుట్టేసుకున్న పాము.. ఒల్లు జలదరించేలా మీదకు దూకి..
Dangerous Snake Visuals

Edited By: Ravi Kiran

Updated on: Jun 21, 2023 | 8:30 AM

Shocking Video: చాలా మంది పామును చూస్తేనే వణికిపోతారు. అలాంటిది పాము మీద పడితే.. పైప్రాణాలు పైకే పోతాయి కదా. పాములకు సంబంధించి అనేక వీడియోలను చూసే ఉంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మీకు కూడా ఒల్లు జల్లుమంటుంది. అవును, ఆ వీడియోలో ఓ పాము గదిలో తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్‌ని చుట్టేసుకుని ఉంది. అయితే అలా చుట్టేసుకోవడమే కాక.. ఫ్యాన్ తిరుగుతండడంతో దాన్ని కాటు వేసే ప్రయత్నం చేసింది. అంతేకాక ఫ్యాన్ రెక్కలపై కూడా అటు ఇటు తిరుగుతూ ఉంది. అంతే ఫ్యాన్ రెక్కల మధ్యలో పడి.. ఒక్కసారిగా ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి మీద పడింది. చూడడానికి వీడియో అయినప్పటికీ.. ఆ పాటు నిజంగా మనపైనే పడిందేమోనన్నంత భయం కలుగుతుంది. ఇలా భయపెట్టేలా సాగిన వీడియోపై నెటినన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

మరోవైపు పాము తనంతట అది కిందపడిందా లేక రెక్కల్లో పడి కిందపడిందా అని అనుమానాస్పదంగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకా వీడియోను చూస్తే హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిందని, ఇలాంటి షాకింగ్ వీడియోలను ఎప్పుడూ చూడలేదని, పాపం పాము ఉందో పోయిందో అంటూ  కామెంట్ చేస్తున్నారు. జూన్ 11న arabbird అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 4 లక్షల 22 వేల లైకులు.. అలాగే 1 కోటి 51 లక్షల వరకు వీక్షణలు లభించాయి. అందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..