Watch: కంటైనర్ లారీ బోల్తా.. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లి, కూతురు మృతి

Updated on: Jun 17, 2025 | 7:14 PM

మహారాణి అనే మహిళ తన కుమార్తె కృతికతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు లారీ కిందపడి నలిగిపోయి మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకేసారి తల్లీ కూతురు మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లి, కూతురుపై కంటైనర్ లారీ బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లా పల్లడంలో చోటు చేసుకుంది. జూన్‌ 17 మంగళవారం రోజున పల్లడం రోడ్డుపై మహారాణి అనే మహిళ తన కుమార్తె కృతికతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు లారీ కిందపడి నలిగిపోయి మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకేసారి తల్లీ కూతురు మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Published on: Jun 17, 2025 07:08 PM