Funny Video: నీ తెలివికి దండం తల్లో.. కొలనులో అందరూ కాయిన్స్ వేస్తే.. అమ్మాయిగారు డెబిట్ కార్డు‌ స్వైప్ చేశారు..!

|

Jun 24, 2023 | 11:53 AM

పుర్రెకో బుద్ధి.. జీహ్వకో రుచి అంటారు పెద్దలు. ఒక్కొక్కరి ఒక్కో టేస్ట్.. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, అభిప్రాయం ఉంటుంది. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలను పరిశీలిస్తే ఆలయాల్లో ఉన్న ఆచారాలు..

Funny Video: నీ తెలివికి దండం తల్లో.. కొలనులో అందరూ కాయిన్స్ వేస్తే.. అమ్మాయిగారు డెబిట్ కార్డు‌ స్వైప్ చేశారు..!
Girl Video
Follow us on

పుర్రెకో బుద్ధి.. జీహ్వకో రుచి అంటారు పెద్దలు. ఒక్కొక్కరి ఒక్కో టేస్ట్.. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, అభిప్రాయం ఉంటుంది. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలను పరిశీలిస్తే ఆలయాల్లో ఉన్న ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం భక్తులు నడుచుకుంటారు. ఆలయాల పరిసరాల్లో కొలనుల్లో స్నానమాచరించడం, దేవుళ్లను దర్శించుకోవడం చేస్తుంటారు. ఇతరత్రా కార్యక్రమాలు ఉంటే.. వాటిని సైతం అనుసరిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఓ భక్తురాలికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ అమ్మాయి నెక్ట్స్ లెవెల్‌ ఫర్ఫార్మెన్స్ ఇచ్చింది మరి.

కొన్ని పురాతన ఆలయాల్లో ప్రసిద్ధమైన కొలనులు ఉంటాయి. వాటిని సందర్శించుకునే భక్తలు ఆ కొలనుల్లో నాణెలు వేసి తమ కోరికలను నేరవేర్చాలని కోరుకుంటారు. ఇలా ఆలయాల్లో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోనూ ఇదే సీన్ ఉంది. ఆలయంలో చిన్న కోనేరులాంటి నీటి గుంట ఉండగా.. భక్తులు అందులో నాణేలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి తన తెలివినంతా ప్రదర్శించింది. మరి ఏ ఉద్దేశ్యంతో చేసిందో గానీ.. నాణేలకు బదులుగా డెబిట్ కార్డ్‌ను తీసింది. ఆ కార్డును కొలను నీటిలో స్వైప్ చేసింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న కొందరు భక్తులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. దానిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఇంత ట్యాలెంటెడ్ ఉన్నావేంటి తల్లీ అని సెటైర్లు, పంచ్‌లు వేస్తున్నారు. నీటిలో ఎంత అమౌంట్ స్వైప్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోన చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..