Viral: ఇలా ఉన్నావేంట్రా మావా.! రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

|

Sep 11, 2024 | 5:09 PM

బుర్రలో కాస్త గుజ్జు ఉంటే.. రాయిని కూడా బంగారం చేయొచ్చు, పనికిరాని పువ్వును కూడా పొద్దుతిరుగుడు పువ్వుగా మార్చొచ్చు అన్నారు తెలివైన మహానుభావులు. మాయదారి కరోనా వచ్చిననాటి నుంచి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పెరిగింది.

Viral: ఇలా ఉన్నావేంట్రా మావా.! రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా
Trending
Follow us on

బుర్రలో కాస్త గుజ్జు ఉంటే.. రాయిని కూడా బంగారం చేయొచ్చు, పనికిరాని పువ్వును కూడా పొద్దుతిరుగుడు పువ్వుగా మార్చొచ్చు అన్నారు తెలివైన మహానుభావులు. మాయదారి కరోనా వచ్చిననాటి నుంచి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పెరిగింది. అది స్కూల్ అయినా.. కాలేజీ అయినా.. లేదా యూనివర్సిటీ అయినా.. ఆఫ్‌లైన్ క్లాసులు ఉన్నా.. లేకపోయినా పర్లేదు. కొన్నివారాల పాటు ఆన్‌లైన్ క్లాసులు కచ్చితంగా ఉండాల్సిందే. ఇంతవరకు సరే.! ఇక్కడ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అంటే యూట్యూబ్‌లోనో లేక యాప్స్‌లోనో పాఠాలు చెప్పడం చూస్తుంటాం. కానీ తైవాన్‌కు చెందిన ఓ మ్యాథ్స్ టీచర్ మొత్తం లెక్కలన్నీ మార్చేశాడు. కొంచెం విభిన్నంగా తన తెలివికి పదునుపెట్టి.. ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..!

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన 34 ఏళ్ల చాంగ్ హ్సు‌కు మ్యాథ్స్‌లో సుమారు 15 ఏళ్ల అనుభవం ఉంది. యూట్యూబ్, ఇతర యాప్స్‌లో ఉన్న కాంపిటీషన్‌ను తట్టుకోవడం కష్టమనుకున్నాడో.. లేక అందరిలో ఒకరిలా కాకుండా.. డిఫెరెంట్‌గా ఉండాలని ఆలోచించాడో గానీ.. తనకు వచ్చిన వెరైటీ ఆలోచనకు అనుకున్నట్టుగా అమలు చేసి.. విభిన్నంగా మార్కెటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది 2020 నుంచి ఆ సైట్‌లో పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. మీకు ఈ ఐడియా వినేందుకు కొంచెం వింతగా అనిపించినా..! అతడి కెరీర్‌ను జెట్ స్పీడ్‌లో దూసుకుపోయేలా చేసింది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వీడియోలు పెడుతూ.. ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అతడి చానెల్‌ “changshumath666″కు 3 మిలియన్ వ్యూస్, 13 వేల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా చిత్రమేమిటంటే.. అతడి తన ఛానెల్‌కు పెట్టుకున్న ట్యాగ్ లైన్.. ‘ప్లే హార్డ్.. స్టడీ హార్డ్’. చూశారా.! మనోడు మహా ఘటికుడు గురూ..

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

ఆ సైటే ఎందుకు.?

ఆ సైట్‌ను చాంగ్ ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉంది బాసూ.. చాలామంది యువకులు, అలాగే కాలేజీ స్టూడెంట్స్ తరచూ అసభ్యకర కంటెంట్ వెబ్‌సైట్‌లకు వస్తుంటారు. ముందు నుంచి వారి దృష్టిని ఆకర్షించిన ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్‌ను ఉంచితే.. తనకు పోటీ తక్కువగా ఉంటుందని అతడు గ్రహించాడు. ఒక గంట నిడివి గల వీడియోలను క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేశాడు. కట్ చేస్తే కోట్లలో సంపాదిస్తున్నాడు చాంగ్. ఇక అక్కడ చాలామంది యూజర్లు తన పాఠాలను పట్టించుకోరని, కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసమే ఇలా చేస్తున్నానని చాంగ్ చెప్పుకొచ్చాడు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి