Viral: డబుల్ ఇస్మార్ట్.. ఏం కిర్రాక్ బుర్రరా నీది.. ఈ ఆన్సర్ చూశారా..?

|

Apr 03, 2024 | 3:55 PM

కొంతమంది ఇచ్చిన ప్రశ్నకు ఏం సమాధానం రాయాలో తెలియక సినిమా స్టోరీలు, తమకు తెలిసిన విషయాలు రాస్తుంటారు. ఇంకొందరు రాని దాని జోలికి వెళ్లడం ఎందుకని.. అలా ఖాళీగా వదిలేస్తారు. కానీ ఇచ్చిన ప్రశ్న నుంచే సమాధానం పట్టేశాడు ఈ ఇస్మార్ట్ కుర్రోడు...

Viral: డబుల్ ఇస్మార్ట్.. ఏం కిర్రాక్ బుర్రరా నీది.. ఈ ఆన్సర్ చూశారా..?
Clever Answer
Follow us on

అది ఎంత టఫ్ సిట్యువేషన్ అయినా..  హైరానా పడకుండా కొంచెం రిలాక్స్‌గా థింక్ చేస్తే.. ఈజీగా బయటపడొచ్చు. అందుకే ఇస్మార్ట్‌గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ముందుకు అలాంటి కిర్రాక్ స్టూడెంట్‌ను తీసుకొచ్చాం. ఇతగాడు ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నకు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ రాశాడు. అతడి తెలివికి టీచర్ ఎక్స్ ట్రా మార్కులు ఇవ్వక తప్పలేదు. అంతేకాదు తెలివైనవాడు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఏవైనా 5 ఇంగ్లీష్ పదాలు స్పెల్లింగ్‌ రాయి (Write Five Words You Can Spell) అనే ప్రశ్నను ఇంగ్లీషులో ఇచ్చారు. దానికి 5 మార్కులు కేటాయించారు. అయితే ఆ ఇస్మార్ట్ స్టూడెంట్ కొత్త పదాల జోలికి పోలేదు. ప్రశ్నలోనే ఉన్న ఐదు ఇంగ్లీషు పదాలను ( Five, Words, You, Can, Spell) ఆన్సర్ షీట్‌లో నింపేశాడు. అతగాడి మెరుపు ఆన్సర్‌కు టీచర్ ఫిదా అయ్యి… 5 కు మరో 2 మార్కులు జత కలిపి 7 మార్కులు వేశారు. వెరీ క్లవర్ అనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.

చూశారుగా చదువు అంటే బట్టి పట్టడం కాదు.. అర్థం చేసుకోవడం. బట్టి పడితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. జీవితంలో ఎదగాలి అనుకునేవారు.. తెలివిగా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ప్రశ్న ఏదైనా కాస్త బుర్ర పెట్టి ఆన్సర్ చేయాలి. ప్రజంట్ జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉందో చూస్తూనే ఉన్నారు కదా.. వారితో నెగ్గుకురావాలనుకుంటే.. ఇస్మార్ట్‌గా ఆలోచించాల్సిందే. లేదంటే మీరు వెనకబడిపోతారు. మీరు మీ స్కూల్, కాలేజ్ డేస్‌లో ఇలా ఎప్పుడైనా ఆన్సర్స్ రాశారా..? వాటిని టీచర్స్ గమనించి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారా..? ఆ అనుభవాలను మాతో షేర్ చేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..