Wedding Offer : బ్యాచిలర్లు పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఆఫర్ చేస్తున్న ప్రభుత్వం..! మరి రెడీ అయిపోండి..

అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అంతే మొత్తంలో డబ్బులు కూడా వస్తాయంటే.. నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఓ దేశంలో ఇలాగే జరుగుతోంది. పెళ్లి చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.31 లక్షలు ఇస్తోంది. దీనికి కారణం.. పెళ్లిళ్లను ప్రోత్సహించడమే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు. పిల్లలు పుడితే వారికోసం భారీగా ఖర్చు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే..

Wedding Offer : బ్యాచిలర్లు పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఆఫర్ చేస్తున్న ప్రభుత్వం..! మరి రెడీ అయిపోండి..
Wedding
Follow us

|

Updated on: Aug 29, 2024 | 11:17 AM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతోంది. భారతదేశంలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ..హోదా కోసం కూడా ఇప్పుడు పెళ్లి ఖర్చులు పెంచేసుకుంటున్నారు చాలా మంది. దీంతో పెళ్లి కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మన దేశంలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో చాలా మంది అప్పులు చేస్తున్నారు. కానీ, ఒక దేశంలో మాత్రం పెళ్లికి చేసుకునే యువతి యువకుల కోసం లక్షల రూపాయలు కానుకగా ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అంతే మొత్తంలో డబ్బులు కూడా వస్తాయంటే.. నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఓ దేశంలో ఇలాగే జరుగుతోంది.

ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పెళ్లి చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.31 లక్షలు ఇస్తోంది. దీనికి కారణం.. పెళ్లిళ్లను ప్రోత్సహించడమే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు. పిల్లలు పుడితే వారికోసం భారీగా ఖర్చు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే.. దక్షిణ కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కొత్త జంటలు పెళ్లి చేసుకుని, ఎక్కువ మంది పిల్లలను కనాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దక్షిణ కొరియాలోని బూసన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు 38,000 డాలర్లు (రూ.31 లక్షలు) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

దక్షిణ కొరియా జనాభా వేగంగా తగ్గిపోతోంది. అక్కడ ప్రతి మహిలా సగటున 0.72 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు. అంటే, ఒక మహిళ ఒక బిడ్డను కూడా కనడం లేదని తెలుస్తుంది. దీంతో జనాభా పెరుగుదల, ప్రసూతి రేటును పెంచేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను అమలు చేస్తోంది. దక్షిణ కొరియా జనాభా దాదాపు 5 కోట్లు మాత్రమే. అలాగే, జపాన్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దక్షిణ కొరియా మాదిరిగానే జపాన్ కూడా తక్కువ జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. గతంలో ఏడాదికి 50 లక్షలుగా ఉన్న జననాల రేటు.. ప్రస్తుతం 7.60 లక్షలకు పడిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో