Viral Video: మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..

మీరు ఎప్పుడైనా మృత్యువుతో దాగుడుమూతలు ఆడటం చూశారా? ఎవరూ అంతటి సాహసం చేసి ఉండదరు.. కానీ, ఇక్కడ ఒక యువకుడు మాత్రం అలాంటి పని చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మెరుపు వేగంతో పరిగెడుతున్న ఒక భారీ పాము తోకను పట్టుకోవడానికి సాహసించిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత జరిగింది చూస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన చాలా మంది ప్రజలు తీవ్రమైన కామెంట్లతో స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
Snake Attack

Updated on: Mar 24, 2026 | 2:54 PM

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే పిచ్చితో కొందరు యువకులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. తాజాగా ఒక యువకుడు భారీ పాముతో చేసిన సాహసం అతడిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. వైరల్‌ వీడియోలో ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక యువకుడు భారీ పామును ఆటపట్టిస్తుంటాడు. ఆ దృశ్యం చూసేవారి గుండె ఒక్కసారిగా ఆగిపోయేలా చేస్తుంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే?

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక నిర్జన ప్రదేశంలో భారీ పరిమాణంలో ఉన్న పామును చూసిన ఒక యువకుడు, భయపడాల్సింది పోయి దాని వెనుక పడ్డాడు. ఆ పామును పట్టుకోవాలనే ఉద్దేశంతో లేదా దాన్ని ఆటపట్టించాలనే ప్రయత్నంలో దాన్ని వెంబడించాడు. పాము తన దారిన తాను వెళ్తున్నా, ఆ యువకుడు పదేపదే దానిని కదిలించడంతో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి దాడికి యత్నించింది. పాము వేగం ముందు ఆ యువకుడు తడబడ్డాడు. అది నోరు తెరిచి అతనిపైకి దూకిన తరుణంలో, అదృష్టవశాత్తూ అతడు వెనక్కి పడిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ భారీ సర్పం కాటు వేసి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది సాహసం కాదు, మూర్ఖత్వం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

వన్యప్రాణి నిపుణులు ఇటువంటి చర్యల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు సహజంగా తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయని, వాటిని అనవసరంగా రెచ్చగొడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పాములు కనిపించినప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాలి తప్ప, ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాలకే ముప్పు అని వారు సూచిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షలాది వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లను భయాందోళనలకు గురి చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us