రెప్పపాటులో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న మూడు రిక్షాలు.. వీడియో చూస్తే షాక్!

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే ఎవరికైనా ఊపిరి ఆగిపోయేంత పనైతుంది. ఈ వీడియోలో, ఒక రిక్షా వేగంగా ప్రయాణిస్తుండగా దాని టైరు అకస్మాత్తుగా ఉడిపోయింది. దాంతో రిక్షా బ్యాలెన్స్ కోల్పోయి ఎదురుగా వస్తున్న మరో రెండు రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, మూడు రిక్షాలు బోల్తా పడి, ప్రయాణికులు రోడ్డు పక్కనే పడిపోయారు.

రెప్పపాటులో ఘోర ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న మూడు రిక్షాలు.. వీడియో చూస్తే షాక్!
Shocking Accident

Updated on: Oct 12, 2025 | 11:36 PM

సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే ఎవరికైనా ఊపిరి ఆగిపోయేంత పనైతుంది. ఈ వీడియోలో, ఒక రిక్షా వేగంగా ప్రయాణిస్తుండగా దాని టైరు అకస్మాత్తుగా ఉడిపోయింది. దాంతో రిక్షా బ్యాలెన్స్ కోల్పోయి ఎదురుగా వస్తున్న మరో రెండు రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, మూడు రిక్షాలు బోల్తా పడి, ప్రయాణికులు రోడ్డు పక్కనే పడిపోయారు. అంతేకాదు పక్క నుంచి వెళ్తున్న ఒక మోటార్ సైకిల్ కూడా ఢీకొట్టడంతో అతని బైక్ రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇది ఎక్కడ జరిగిందో ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఈ దృశ్యం అది రద్దీగా ఉండే నగర వీధిలో జరిగినట్లు మాత్రం తెలుస్తోంది. ఈ వీడియో రోడ్డుపై ట్రాఫిక్‌ను స్పష్టంగా చూపిస్తుంది. బీజీగా ఉన్న రోడ్డుపై అనేక రిక్షాలు ఒకదాని తర్వాత ఒకటి పరుగులు పెడుతున్నాయి. అకస్మాత్తుగా, ఒక రిక్షా టైర్ ఊడిపోయింది. కొన్ని సెకన్లలోనే అంతా గందరగోళం జరిగిపోయింది. రిక్షా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ కింద పడిపోయారు. దీని వలన రోడ్డుపై గందరగోళం ఏర్పడింది.

ఈ వీడియోలో మూడు రిక్షాలు ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. ఢీకొన్న తరువాత, చాలా మంది రోడ్డుపై పడిపోయారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక బైకర్ కూడా ఆకస్మిక ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఢీకొన్న శక్తి చాలా బలంగా ఉండటంతో అతని బైక్ అదుపు తప్పి, అతను కూడా రోడ్డుపై పడిపోయాడు. క్షణాల్లో, రోడ్డు అంతటా గందరగోళం నెలకొంది.

ప్రమాదం జరిగిన వెంటనే, సమీపంలో ఉన్నవారు సహాయం కోసం పరుగెత్తారు. కొందరు గాయపడిన ప్రయాణికులను పైకి లేపారు. మరికొందరు పడిపోయిన రిక్షాలను సరిచేయడానికి ప్రయత్నించారు. కొంతమంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్లు వీడియోలో కనిపించింది. మరికొందరు కుంటుతూ లేవడానికి ఇబ్బంది పడ్డారు. ఒక వ్యక్తి ఇతరుల సహాయంతో నడుస్తున్నట్లు కనిపించింది. చుట్టుపక్కల జనం భయాందోళనకు గురైనట్లు కనిపించారు. కానీ గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..