Viral: ఆ గ్రామ ప్రజలు కోటీశ్వరులు.. అసలు బట్టలే ధరించరు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

Spielplatz Britian Village: ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తరచూ ఇలాంటి విషయాలను ప్రజలు సోషల్ మీడియా...

Viral: ఆ గ్రామ ప్రజలు కోటీశ్వరులు.. అసలు బట్టలే ధరించరు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
Bizzre News

Updated on: Apr 07, 2021 | 7:12 PM

Spielplatz Britian Village: ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తరచూ ఇలాంటి విషయాలను ప్రజలు సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటూ ఆశ్చర్యపోతారు. అదే కోవకు చెందిన ఓ విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. మీరు కూడా దాన్ని చదివిన తర్వాత.. ఏంటి ఇది నిజమా.! అని షాక్ అవుతారు. అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ప్రజలెవ్వరూ కూడా బట్టలు ధరించరు. ప్రపంచంలో ఇలాంటి గ్రామం కూడా ఒకటి ఉందా.? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే. అక్కడుంటున్న వారందరూ కోటీశ్వరులే.. కానీ బట్టలు ధరించరు. పర్యాటకులకు ఇదే రూల్ వర్తిస్తుంది. అసలు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.!

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న ఈ గ్రామం పేరు స్పీల్‌ప్లాట్జ్. ఈ గ్రామ ప్రజలు దాదాపు 85 సంవత్సరాలు బట్టలు లేకుండా జీవించారు. అక్కడ నివసిస్తున్న వారందరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. కావల్సినంత సంపద కూడా ఉంది. అయినప్పటికీ, పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ బట్టలు లేకుండా ఉంటారు. గొప్ప విషయం ఏమిటంటే ఇలా చేయడం అక్కడున్న వారెవ్వరికీ కూడా అసౌకర్యంగా ఉండదట.

అక్కడి మీడియా తెలుపుతున్న వివరాల ప్రకారం.. ఈ గ్రామాన్ని 1929వ సంవత్సరంలో ఇసుల్ట్ రిచర్డ్‌సన్ కనుగొన్నాడు. అతను ఈ గ్రామాన్ని కనుగొన్నప్పుడు, అతను తన మిగతా జీవితాన్ని ఈ గ్రామంలో గడపాలని నిర్ణయించుకున్నాడట. ఈ గ్రామంలో పబ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ కూడా ఉంది. అక్కడున్న వారు మాత్రమే కాదు పర్యాటకులు కూడా ఈ రూల్స్‌ను ఖచ్చితంగా పాటించాలట..

‘వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు దుస్తులు ధరిస్తారు’

ఆ గ్రామ ప్రజల్లో ఎవరైనా వస్తువులు కొనుగోలు చేసేందుకు వేరే నగరానికి లేదా ప్రాంతానికి వెళ్లినప్పుడు దుస్తులు ధరిస్తారట. ఇదే కాకుండా జలుబు వచ్చినప్పుడు, గానీ, చలి వేసినప్పుడు, లేదా మరేదైనా కారణం వల్ల గానీ బట్టలు ధరించాలనుకుంటే, అతడు/ఆమె ధరించవచ్చు. ఈ రూల్‌పై చాలా సామాజిక సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

Loading...
Unable to load recommendations.
Follow Us