వానొచ్చే….. వరదొచ్చే …ఎలకమ్మకు బెదురొచ్ఛే .. !

|

Aug 14, 2019 | 12:34 PM

చైనాను లెకిమా తుఫాను వణికించేస్తోంది. ఈ తుఫానుతో కూడిన వర్షాలు, వరదలు పలు నగరాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో వరదలకు సుమారు 49 మంది బలయ్యారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ అక్కడక్కడా నోరులేని మూగజీవాలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నాయి. జియాంగ్ ప్రావిన్స్ లోని ఓ ఇల్లంతా వరదనీటితో నిండిపోగా.. ఓ అమ్మాయి.. ఒక టేబుల్ మీద కాళ్ళు ముడుచుకుని […]

వానొచ్చే..... వరదొచ్చే ...ఎలకమ్మకు బెదురొచ్ఛే .. !
Follow us on

చైనాను లెకిమా తుఫాను వణికించేస్తోంది. ఈ తుఫానుతో కూడిన వర్షాలు, వరదలు పలు నగరాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో వరదలకు సుమారు 49 మంది బలయ్యారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ అక్కడక్కడా నోరులేని మూగజీవాలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నాయి. జియాంగ్ ప్రావిన్స్ లోని ఓ ఇల్లంతా వరదనీటితో నిండిపోగా.. ఓ అమ్మాయి.. ఒక టేబుల్ మీద కాళ్ళు ముడుచుకుని కూచున్న వేళ.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిట్టెలుక.. ఆ నీటి గండం నుంచి తనను కాపాడుకునేందుకు ఆ టేబుల్ కు ఉన్న నాలుగు ‘ కాళ్ళ ‘ లో ఒకదాన్ని గట్టిగా పట్టుకుని పైకి ఎగబాకడానికి ప్రయత్నిస్తూ.. కెమెరాకు దొరికిపోయింది. దాని అవస్థలు చూసి అంతటి విషమ స్థితిలోనూ ఆ టీనేజర్ నవ్వాపుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది మరి !