
తమ కష్టానికి తగిన గుర్తింపు లభించినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ విజయాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో అందుకున్నప్పుడు ఆ సంతోషం మరింత రెట్టింపవుతుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకున్న ఓ హృద్యమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను హత్తుకుంటోంది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్న చరణ్‌జీత్ సింగ్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్న కార్యక్రమానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో చరణ్‌జీత్ సింగ్‌కు కొత్త హోదా కల్పిస్తూ ఆయన పోలీస్ యూనిఫామ్‌పై కొత్త ర్యాంకు స్టార్‌ను అమర్చారు. ఈ కీలక ఘట్టాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా వీక్షించారు. తమ కుటుంబ సభ్యుడు మరో మెట్టు ఎదిగి, ఉన్నత హోదాను అందుకోవడాన్ని చూసి వారు భావోద్వేగానికి గురయ్యారు. కొందరి కళ్లలో ఆనందభాష్పాలు కనిపించగా, మరికొందరు చిరునవ్వులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కుటుంబం ఆనందానికి అవధుల్లేవు!
చరణ్‌జీత్ సింగ్ యూనిఫామ్‌పై కొత్త స్టార్‌ను ఉంచిన క్షణం ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది కేవలం ఒక పోలీసు అధికారి పదోన్నతి వేడుక మాత్రమే కాదు.. ఆయన వెనుక నిలిచిన కుటుంబ సభ్యుల ప్రేమ, ప్రోత్సాహం, నిరీక్షణకు గుర్తుగా కనిపించింది. ఒకరి విజయానికి కుటుంబం అందించే మద్దతు ఎంత విలువైనదో అక్కడి వారి స్పందన స్పష్టం చేసింది.
నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
అమృత్‌సర్‌కు చెందిన ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. చరణ్‌జీత్ సింగ్ సాధించిన విజయంపై అభినందనలు తెలుపుతూ, ఆయన కుటుంబ సభ్యుల ఆనందాన్ని ప్రశంసిస్తున్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ఒక ఎత్తయితే, ఆ విజయాన్ని మనవాళ్ల కళ్లలో ఆనందం చూస్తూ ఆస్వాదించడం మరో ప్రత్యేక అనుభూతి అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, యూనిఫామ్‌పై మెరిసిన కొత్త స్టార్ కంటే.. ఆ సమయంలో కుటుంబ సభ్యుల కళ్లలో కనిపించిన ఆనందమే ఈ వీడియోకు అసలైన ప్రత్యేకతగా నిలిచింది. ఈ చిన్న వేడుకలోని భావోద్వేగాలు ఎంతోమందిని కదిలిస్తున్నాయి.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..