ఈ హోటళ్లలో 3 రూపాయలకే బోలెడు భోజనం దొరుకుతుంది..! వెజ్‌, నాన్‌వెజ్‌తో పాటు చేపలు కూడా.. ఎక్కడో తెలుసా..?

|

Nov 03, 2023 | 6:32 PM

ప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హోటల్‌లో నిరుపేద కూలీల నుంచి పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే వారి వరకు భోజనం పెడుతున్నారు. హోటల్ సిద్దేశ్వరి 'కోబిరాజీ జోల్' అనే స్నాక్‌ ఐటమ్‌ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది అరటి, బంగాళాదుంప, బొప్పాయిని ఉపయోగించి తయారుచేసిన చేపల వంటకం ఇది. ఇందులో చాలా తక్కువ నూనెను ఉపయోగిస్తారు. ఇదీ కాకుండా అనేక ఇతర చేపల వంటకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ లభించే రకరకాల చట్నీలు కూడా చాలా ఫేమస్.

ఈ హోటళ్లలో 3 రూపాయలకే బోలెడు భోజనం దొరుకుతుంది..! వెజ్‌, నాన్‌వెజ్‌తో పాటు చేపలు కూడా.. ఎక్కడో తెలుసా..?
Pice Hotels In Kolkata
Follow us on

రూపాయికి చాక్లెట్ కూడా దొరకని కాలం ఇది. ఇక సింగిల్‌ కూడా హోటల్ కు వెళితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల బిల్లు కట్టాల్సిందే. నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పులు, వంటనూనె వంటి ఆహార ఉత్పత్తుల ధరలు, కూరగాయల ధరలు చాలా పెరిగాయి. అంతే కాకుండా కూలీల సమస్య, జీతభత్యాలు భరించడం హోటల్ యజమానులకు కష్టంగా ఉంది. అందుకే హోటల్ ఫుడ్ ధరలు పెరిగాయి. హోటల్‌లో కాఫీ, టీలు, స్నాక్స్‌లు తీసుకోవడం సామాన్యులకు కష్టం. ఇలా అన్నింటి ధరలు పెరిగిన తరుణంలో కేవలం 3 రూపాయలకే హోటల్ లో ఫుల్ మీల్ దొరుకుతుందంటే నమ్ముతారా? తప్పక నమ్మాలి. ఎందుకంటే కోల్‌కతాలోని పీస్ హోటల్‌లో చాలా మంది రోజుకు కేవలం 3 రూపాయలకే భోజనం తిని కడుపు నింపుకుంటారు.

కోల్‌కతాలోని హోటల్ సిద్దేశ్వరి ఆశ్రమం: గతంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అనేక హోటళ్లు పర్యాటకులు, వలసదారులకు చాలా తక్కువ ధరలకు ఆహారాన్ని అందించాయి. ఇప్పుడు వాటిలో కొన్ని హోటళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కోల్‌కతాలోని సర్ స్టువర్ట్ హాగ్ మార్కెట్ సమీపంలోని హోటల్ సిద్దేశ్వరి ఆశ్రమం చౌకగా భోజనాన్ని అందిస్తుంది. ఈ హోటల్‌ను 1928లో ఖుదీరామ్ సర్కార్ అనే వ్యక్తి స్థాపించారని చెబుతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హోటల్‌లో నిరుపేద కూలీల నుంచి పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే వారి వరకు భోజనం పెడుతున్నారు. హోటల్ సిద్దేశ్వరి ‘కోబిరాజీ జోల్’ అనే స్నాక్‌ ఐటమ్‌ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది అరటి, బంగాళాదుంప, బొప్పాయిని ఉపయోగించి తయారుచేసిన చేపల వంటకం ఇది. ఇందులో చాలా తక్కువ నూనెను ఉపయోగిస్తారు. ఇదీ కాకుండా అనేక ఇతర చేపల వంటకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ లభించే రకరకాల చట్నీలు కూడా చాలా ఫేమస్.

స్వాధీన భారత్ హిందూ హోటల్ : కోల్‌కతాలోని శాంతి హోటళ్లలో స్వాధీన భారత్ హిందూ హోటల్ కూడా ఒకటి. ఇది కోల్‌కతాలోని కాలేజ్ స్ట్రీట్‌లో ఉంది. ఈ హోటల్ కూడా 1927లో ప్రారంభమైంది. దీనిని గోబిందో పోండా అనే వ్యక్తి స్థాపించాడు. ఈ హోటల్‌లో 28 రకాల స్వచ్ఛమైన శాఖాహార భోజనాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

జగన్నాథ్ ఆశ్రమ హోటల్: 1952లో ప్రారంభమైన ఈ హోటల్ కోల్‌కతాలోని కాలేజ్ స్ట్రీట్‌లో ఉంది. విద్యార్థులు, కార్మికులు ఇక్కడ భోజనం చేస్తూ ఆనందిస్తారు.

పర్బతి హోటల్: కోల్‌కతాలోని జాదూ బాబర్‌లో ఉన్న ఈ హోటల్ 1960లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ హోటల్‌లో తక్కువ ధరలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. ఈ పీస్ హోటల్ చేపల ప్రేమికులకు అనుగుణంగా వంటకాలు తయారు చేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..