Optical Illusion: ఈ ఫొటోలో ఒక పక్షి, ఒక జంతువు దాగి ఉన్నాయి.. అవేంటో కనిపెడితే మీరు గ్రేటే..

Optical Illusion: కంటికి, మెదడకు ఒకేసారి పరీక్ష పెట్టే ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు గతంలో ఎక్కువగా దిన, వార పత్రికలు, మ్యాగజైన్లలో ఎక్కువగా కనిపించేవి. అయితే ఇటీవల కూడా ఈ ఫొటోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి.

Optical Illusion: ఈ ఫొటోలో ఒక పక్షి, ఒక జంతువు దాగి ఉన్నాయి.. అవేంటో కనిపెడితే మీరు గ్రేటే..
Optical Illusion

Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2022 | 8:07 AM

Optical Illusion: కంటికి, మెదడకు ఒకేసారి పరీక్ష పెట్టే ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు గతంలో ఎక్కువగా దిన, వార పత్రికలు, మ్యాగజైన్లలో ఎక్కువగా కనిపించేవి. అయితే ఇటీవల కూడా ఈ ఫొటోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. పనిలో ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోల గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇది మిమ్మల్ని కచ్చితంగా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. చూడ్డానికి ఈ ఫొటో చాలా సింపుల్ గా ఉన్నా.. దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. అందుకే ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ ఫోటోను సాల్వ్ చేయాలంటే కొంచెం ఓపిక కూడా తెచ్చుకోవాల్సిందే.

కుడివైపు నుంచి చూస్తే..

పై చిత్రాన్ని సరిగా గమనిస్తే.. ఇందులో ఓ జంతువు, పక్షి ఉన్నాయి. అయితే మొదటి సారి చూసిన వారికి మొదట బాతు బొమ్మ కనిపిస్తుంది. అయితే ఇందులో మరో జంతువు కూడా ఉంది. అదే కుందేలు. మీరు తదేకంగా గమనిస్తే.. బాతు మూతి భాగంలోనే కుందేలు చెవులు దాగి ఉన్నాయి. అలా చూస్తే కుడివైపు నుంచి కుందేలుగా.. ఎడమవైపు నుంచి బాతు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

Also Read: New Ministers: ఏపీ కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కేది ఎవరికంటే.. సామాజిక కోణంలో

పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!

TS RTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. తెలంగాణలో మళ్లీ పెరగనున్న బస్ చార్జీలు..? ఎంత పెరుగుతాయంటే..