Optical illusion: మీ కోసం కిర్రాక్ పజిల్.. ఈ ఫోటోలో చేపను కనిపెడితే మీ ఐ పవర్ అదుర్స్ అంతే

Trending Photo: డైలీ పజిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని సాల్వ్ చేయడం చాలా ఈజీ.. ఇంకొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. అంతుచిక్కని చిక్కుముడిగా ఉంటాయి.

Optical illusion: మీ కోసం కిర్రాక్ పజిల్.. ఈ ఫోటోలో చేపను కనిపెడితే మీ ఐ పవర్ అదుర్స్ అంతే

Updated on: Aug 17, 2022 | 1:37 PM

Viral Photo: వచ్చేశాం..  మీ కోసం కిర్రాక్ పజిల్ తెచ్చేశాం. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో ఈ ఫోటోతో టెస్ట్ చేసుకోండి. ముందే చెప్తున్నాం.. ఇది చాలా టఫ్. మిమ్మల్ని బాగా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఈ ఫోటోలో దాగి ఉన్న చిన్న చేప మీతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీటిలో వల కానీ, గాలం కానీ లేకుండా చేపను పట్టడం ఎంత కష్టమో.. ఫోకస్ పెట్టకుండా ఈ ఫోటోలోని చేపను కనిపెట్టడం కూడా అంతే కష్టం. ఆ చేప కలర్ అక్కడున్న నాచు రంగులో ఇమిడిపోయింది. అందుకే దాన్ని కనిపెట్టడం కాస్త కష్టమైన టాస్క్. మీరు మెరిట్ అయితే.. సమస్యలను సృజనాత్మకతతో చేధించేవారు అయితే మీరు దాన్ని ఈజీగానే పట్టేయగలరు. వెంటనే ఆన్సర్ ఉన్న ఫోటో కోసం స్క్రోల్ చేయవద్దు. కనీసం ఎఫర్ట్స్ పెట్టండి. అరె మా వల్ల కాదు.. ఇక సమాధానం కనిపెట్టడం అసాధ్యం అనుకున్నప్పుడే దిగువన ఇచ్చిన ఆన్సర్‌పై లుక్కేయండి. మాకు తెలుసులేండి.. మీరు పట్టువదలని విక్రమార్కులు.. ఆన్సర్ చిక్కే వరకు వదలిపెట్టరు.

 

ప్రజంట్ ఈ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. ఆ ఫిష్‌ ఎక్కడంతో కనిపెట్టడంలో చాలామంది విఫలమయ్యారు. ఇంతకీ మీకు ఈ పజిల్ నచ్చిందా..?.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి