
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్స్ మాత్రమే జనాలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలకు సవాల్ విసురుతుంటాయి. వీటిని ఛాలెంజ్‌గా తీసుకునే నెటిజన్లు కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఆలోచనా శక్తి మెరుగుపడుతుందని చాలామంది భావిస్తారు. దీంతో నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా సులభంగా పరిష్కరించే నైపుణ్యాలు అలవడతాయి.
అయితే ఇది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. మీరు నిరంతరం ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం ద్వారా మీ పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను పరిష్కరిస్తూ మీ ఏకాగ్రత, పరిశీలనా శక్తిని పెంచుకోవాలనుకుంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పజిల్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. మొదట్లో ఇది మీకు కాస్త కష్టంగా అనిపించినా.. నిరంతరం ప్రయత్నిస్తే సులభంగా పరిష్కరించగలుగుతారు.
వైరల్ చిత్రంలో ఏముంది?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కొన్ని ఇమోజీలు ఉన్నాయి. అయితే అవన్నీ నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తున్నాయి. కానీ వాటి మధ్యలో ఒక ఇమోజీ మాత్రం మిగతా వాటన్నింటికంటే భిన్నంగా కోపంగా కనిపిస్తోంది. దాన్ని మీరు కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. అదే మీ టాస్క్! మరి మీరు ఈ సవాల్‌కు సిద్ధమైతే.. మీ టైమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
సమాధానం కనిపెట్టారా?
మీకు ఇచ్చిన సమయంలో కోపంగా ఉన్న ఇమోజీని కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్! మీ పరిశీలనా శక్తి చాలా బాగుందని అర్థం. ఒకవేళ మీరు ఆ ఇమోజీని కనిపెట్టలేకపోయినా పర్లేదు.. అందుకోసం మేము మీకు సహాయం చేస్తాం. చిత్రంలో ఎడమవైపు చివరి నుంచి రెండో వరుసలో ఉన్న రెండో ఇమోజీని గమనించండి. అది మిగతా వాటన్నింటికంటే భిన్నంగా కోపంగా కనిపిస్తుంది. అక్కడే మీ సమాధానం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.