Viral Video: వామ్మో ఇంతుందేంది భయ్యా.. లైఫ్‌లో ఇంతపెద్ద పామును చూసుండరు! ఎలా బుసలు కొడుతోందో

చాలా మంది పాము పేరు వింటేనే భయపడిపోతారు.. అదే పాము ఎదురుపడితే, ఆ పాము సుమారు అనకొండ సైజులో ఉంటే ఇంకే ముంది గుండెలు జారిపోవు. అచ్చం అంలాంటి ఘటనే ఒడిశాలో వెలుగు చూసింది. బ్యాంక్ సమీపంలో ఉన్న ఓ భవనంలో భారీ నాగుపాము కనిపించింది. దాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయి పరుగులు పెట్టారు.

Viral Video: వామ్మో ఇంతుందేంది భయ్యా.. లైఫ్‌లో ఇంతపెద్ద పామును చూసుండరు! ఎలా బుసలు కొడుతోందో
12 Foot King Cobra Panics Odisha Bank Area

Updated on: Apr 03, 2026 | 10:55 AM

ఒడిశాలోని గంజాం జిల్లా చికిటి ప్రాంతంలో ఒక భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. చికిటి ఎన్.ఎ.సి పరిధిలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో గురువారం ఉదయం సుమారు 12 అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. పక్కనే ఉన్న బ్యాంక్ వద్దకు వచ్చిన స్థానికులు ఈ భారీ కోబ్రాను చూసి భయంతో వణికిపోయారు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. కాస్త దూరంగా వెళ్లి దాన్ని తీక్షణం చూడడం స్టార్ట్ చేశారు. మరికొందరు జనాలు దూరం నుంచి ఆ కోబ్రాను రాళ్లతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలను మనం వీడియో చూడవచ్చు.

ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వెంటనే ‘స్నేక్ క్యాచర్‌తో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. కోబ్రా భారీగా ఉండడంతో దాన్ని పట్టుకునేందుకు స్నే్క్ క్యాచర్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా ఆ కోబ్రాను బంధించిన స్నేక్ క్యాచర్.. ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా అటవీశాఖ అధికారుల ఆద్వరంలో పామును పట్టుకుని, సురక్షితంగా సమీపంలోని కేరండిమల్ అడవుల్లో విడిచిపెట్టారు.

అయితే ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ.. భిత్తరకనిక అడవుల్లో సుమారు 3,000 పైగా పాములు ఉన్నాయని తెలిపారు. పాములు సాధారణంగా తమకు ముప్పు పొంచి ఉందని భావిస్తేనే ఆత్మరక్షణ కోసం దాడి చేస్తాయని, ప్రజలు అనవసరంగా వాటి జోలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకొవద్దని తెలిపారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే స్నేక్ క్యాచర్ లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు వామ్మో ఇంతపెద్ద కింగ్ కోబ్రాను ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేస్తున్నారు. ఇది నాగుపామా లేదా అనకొండానా.. అంతందేటి భయ్యా అని మరో యూజర్ కామెంట్ చేశారు.

వీడియో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us