పోలీస్ స్టేషన్ లో నవవధువు హల్ చల్.. ప్రియుడితో రెండో పెళ్లి చేయాలని డిమాండ్

ఈ మధ్య పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకులు మద్యం తాగి వచ్చి హంగామా చేయడం.. వధువులకు ఇది నచ్చక పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు జరిగాయి. అయితే వాటికి భిన్నంగా ఓ పెళ్లి కూతురు మద్యం తాగి పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసింది.

పోలీస్ స్టేషన్ లో నవవధువు హల్ చల్.. ప్రియుడితో రెండో పెళ్లి చేయాలని డిమాండ్
Bride

Updated on: Apr 02, 2023 | 7:01 PM

ఈ మధ్య పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకులు మద్యం తాగి వచ్చి హంగామా చేయడం.. వధువులకు ఇది నచ్చక పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు జరిగాయి. అయితే వాటికి భిన్నంగా ఓ పెళ్లి కూతురు మద్యం తాగి పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేసింది. తనకు రెండ పెళ్లి కావాలంటూ అరుస్తూనే ఉంది. పోలీసులు ఎంతగా ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆగలేదు. వివరాల్లోకి వెళ్తే ఓ మహిళకు ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ప్రియుడితో రెండో పెళ్లి జరిపించాలని గట్టిగా అరుస్తూ డిమాండ్ చేసింది.

ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్లకు వినకుండా వారి వద్ద ఉన్న కాగితాలను, ఫోన్లను విసిరేసింది. చివరికి ఓ లేడి కానిస్టేబుల్ అదుపు చేసి గదిలోకి లాక్కేల్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటీజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి పెళ్లి ఆమెకు బాధ కలిగించిందని ఒకరు.. తప్పతాగి ఇలా చేయడమేంటని మరోకరు కామెంట్లు చేశారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..