Viral Video: గాల్లోకి లేచిన హెలికాఫ్టర్ ఒక్కసారిగా భూమిపై ఉన్న కారుపై కుప్పకూలింది..!

Viral Video: ప్రపంచంలో చాలా మంది ఒక్కరోజైనా హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించాలని కోరుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే

Viral Video: గాల్లోకి లేచిన హెలికాఫ్టర్ ఒక్కసారిగా భూమిపై ఉన్న కారుపై కుప్పకూలింది..!
Mexico Navy Chopper Crasah

Updated on: Aug 27, 2021 | 11:53 AM

Viral Video: ప్రపంచంలో చాలా మంది ఒక్కరోజైనా హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించాలని కోరుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తే ఆ నిర్ణయం మానుకుంటారు. నిజానికి హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నది. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో హెలికాఫ్టర్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వీడియో చూస్తే ఇది మెక్సికన్లకు సంబంధించినదని స్పష్టంగా తెలుస్తుంది. నేవీకి చెందిన హెలికాప్టర్ అకస్మాత్తుగా ప్రమాదానికి గురవుతుంది. హెలికాప్టర్ మొదట వ్యాన్‌ను ఢీకొట్టి, ఆపై కారుపైకి పడుతుంది. ఊహించని సంఘటన జరగడంతో భయంతో అక్కడి నుంచి ప్రజలు పరుగెత్తి వారి ప్రాణాలను కాపాడుకుంటారు.

వీడియో చూసినట్లయితే హెలికాప్టర్ తక్కువ ఎత్తులోకి ఎగురుతుంది అనంతరం అక్కడే చుట్టూ తిరగడం మనం గమనించవచ్చు. అలా తిరుగుతూ ఒక్కసారిగా భూమిపై ఉన్న కారుపై కుప్పకూలడం స్పష్టంగా చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతోంది. ఒక సమాచారం ప్రకారం మెక్సికన్ ఆర్మీకి చెందిన నలుగురు సైనికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మెక్సికోలోని హిడాల్గో రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన తర్వాత హెలికాప్టర్ ఎలా బ్యాలెన్స్ కోల్పోయిందో వీడియోలో చూడవచ్చు. మెక్సికన్ నేవీకి చెందిన ఈ హెలికాప్టర్ గ్రేస్ హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో అది ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Train Brake System: రైలుకి బ్రేకులు ఎలా పడుతాయో ఎప్పుడైనా ఆలోచించారా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Rashi Khanna: షూటింగ్‌ విరామంలో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూశారా.? దాని గురించే ఆలోచన..

AP Schools: స్కూళ్లలో హాజరు శాతం పెరుగుతోంది.. పాఠశాలల పునఃప్రారంభంపై ఏపీ మంత్రి ఆదిమూలపు..

Zainab Abbas: సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్​ అబ్బాస్​.. ఏం జరుగుతోంది..?