పరమానందయ్య శిష్యుల కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను కూడా వారి శిష్యరిక బృందానికి చెందిన వ్యక్తే అనుకుంటా.. అచ్చం వారిలానే చేస్తున్నాడు. ఏదీ ఏమైనా చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నాడు. అది వర్షంపడినా, పిడుగు పడ్డా.. మాట తప్పటం లేదు. ఇదిగో ఇక్కడో వ్యక్తి ఏం చేస్తున్నాడో.. చూస్తున్నారుగా, అందుకే ఇతన్ని పరమానందయ్య శిష్యుల బృందానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చింది.
జోరుగా వర్షం పడుతుంటే..ఇతడు చేస్తున్న పని విచిత్రంగా ఉంది కదూ..అసలే పైనుంచి కిందకు ఏకధాటికిగా వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ ఇతగాడు..సిమెంటు ఇటుకలకు నీళ్లు కొడుతున్నాడు. ఇంతటి వానలో వాటిని మళ్లీ తడపటం అవసరమా చెప్పండి.? ఈ అద్భుతమైన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తికి పని పట్ల గల అంకిత భావం అర్థం అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మంచి పనిమంతుడు అంటున్నారు. ఇంకొందరైతే, ఏం తెలివిరా బాబు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
The most sincere worker ? pic.twitter.com/mXETX8eieE
— Susanta Nanda IFS (@susantananda3) June 13, 2021
Also Read:
గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!
మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!
కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!