Viral News: డైపర్‌లపై క్రేజ్.. నెలల తరబడి టాయిలెట్‌‌కు వెళ్లకుండా ఉన్నాడు.. ఆఖరికి పెళ్లిలోనూ..

Viral News: ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన వైఖరి, అభిమతం, ఇష్టాలు కలిగి ఉంటారు.

Viral News: డైపర్‌లపై క్రేజ్.. నెలల తరబడి టాయిలెట్‌‌కు వెళ్లకుండా ఉన్నాడు.. ఆఖరికి పెళ్లిలోనూ..
Diaper

Updated on: Sep 19, 2021 | 10:10 PM

Viral News: ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన వైఖరి, అభిమతం, ఇష్టాలు కలిగి ఉంటారు. కొందరి ఇష్టాలు గమనిస్తే.. మరీ విచిత్రంగా ఉంటాయి. ఇంకొందరి ఇష్టాలు విడ్డూరంగా, షాకింగ్‌గా ఉంటాయి. ఇక్కడ ఓ వ్యక్తి ఇష్టాలు కూడా జనాలను షాక్‌కు గురి చేస్తున్నాయి. సాధారణంగా చిన్న పిల్లలకు డైపర్‌లు తొడుగుతుంటారు. ప్రస్తుత కాలంలో వృద్ధుల కోసం కూడా డైపర్‌లు వచ్చాయి. తరచూ మూత్రం వెళ్లే వృద్ధులు, డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఈ డైపర్‌లను తయారు చేశారు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ డైపర్‌ ధరిస్తుంటాడు. డైపర్ అంటే అతనికి చాలా క్రేజ్ అట. ఆ కారణంగానే అతను డైపర్ ధరిస్తాడట. ఒకసారి వేసుకున్న డైపర్‌ను వారాలపాటు తీయడు. ఒక్కొక్కసారి అయితే నెల రోజులకు పైగా టాయిలెట్‌కు వెళ్లకుండా ఉండటాడు. డైపర్‌లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. అతని పెళ్లి సందర్భంలోనూ డైపర్ వేసుకునే ఉన్నాడట.

మరి ఈ క్రేజీ మ్యాన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికాలోని నెబరాస్కాలో నివసిస్తున్న మేజ్‌కు డైపర్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డైపర్స్ అంటే అతనికి చాలా ఇష్టం. అతను పెరిగే కొద్ది.. అతని ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టం మేరకే ఇప్పటికీ డైపర్ ధరిస్తూ ఉంటాడు. ఆ డైపర్‌లోనే చిన్నపిల్లాడి మాదిరిగా కాలకృత్యాలు తీర్చేసుకుంటాడు. అలా ఒకసారి ధరించిన డైపర్‌ను 5 వారలకు ఒకసారి, 24 గంటలకు ఒకసారి, 7 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటాడట. డైపర్ ధరించాల్సిందిగా తన సహచరులకూ సూచించేవాడట. డైపర్ ధరించడం ద్వారా థ్రిల్లింగ్, ఆనందాన్ని ఆస్వాధిస్తాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తానే వెల్లడించాడు.

తడిసిన డైపర్‌ల అనుభూతి తనకు బాగా నచ్చిందని మేజ్ చెప్పుకొచ్చాడు. తనలాగే డైపర్‌ వేసుకోవడాన్ని ఇష్టపడే వారు చాలామంది ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇలా డైపర్ ధరించేవారంతా ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. అంతేకాదు.. అదే గ్రూపులో ఉన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంకా షాకింగ్ ఏంటంటే.. వారి పెళ్లిలోనూ ఇద్దరూ డైపర్ ధరించుకునే ఉన్నారని మేజ్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ విషయం ఎవరికీ తెలియదని తాజాగా రివీల్ చేశాడు.

Also read:

Skin Problems-Ayurveda Tips: సాధారణ చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా సైడ్‌ఎఫెక్ట్స్‌లేని ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

Monkey Video: అయ్యో పాపం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కున్న కోతి పిల్ల.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.