Viral Video: వంతెనపై ఫుల్ స్పీడ్‌లో కారు.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు.. మైండ్ బ్లాంక్ వీడియో..!

Viral Video: చాలా మంది రొటీన్‌కు భిన్నంగా ఏదో చేయాలని తపించిపోతుంటారు. ప్రతీది వినూత్నంగా చేయాలని అనుకుంటారు. ఇందులో భాగంగా సరికొత్త సాహసాలు చేస్తుంటారు.

Viral Video: వంతెనపై ఫుల్ స్పీడ్‌లో కారు.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు.. మైండ్ బ్లాంక్ వీడియో..!
Stunt

Updated on: Apr 17, 2022 | 6:28 AM

Viral Video: చాలా మంది రొటీన్‌కు భిన్నంగా ఏదో చేయాలని తపించిపోతుంటారు. ప్రతీది వినూత్నంగా చేయాలని అనుకుంటారు. ఇందులో భాగంగా సరికొత్త సాహసాలు చేస్తుంటారు. ప్రస్తుత ప్రపంచంలో సాహస ప్రియులకు కొదవే లేదని చెప్పొచ్చు. అడ్వేంచర్ చేయడం అంటే తెగ సంబరపడిపోతుంటాయి. కొందరైతే డేంజరస్ అడ్వేంచరస్‌ను సునాయాసంగా చేసి చూపరుల మతిపోగొడతారు. తాజాగా అలాంటి షాకింగ్ అడ్వేంచర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత ధైర్యం ఎలా సాధ్యం సామీ అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

సాధారణంగా చాలా మంది కొండగుట్టలపై ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. మరికొందరు స్కై డైవ్ చేస్తుంటారు. కొండపై నుంచి దూకడం, విమానాల్లో పైకి వెళ్లి డైవింగ్ చేయడం చేస్తుంటారు. ఇవన్నీ రోటీన్ అనుకున్నాడు ఓ వ్యక్తి. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇంకేముంది.. అనుకున్నదే తడవు.. సరికొత్త ప్రయోగానికి తెరలేపాడు. ఓవంతెనపై జెట్ స్పీడ్‌లో కారు వెళుతుండగా.. ఆ కారు టాప్‌పై కూర్చున్నాడు. వంతెన మధ్యలోకి కారు చేరుకోగానే.. ఒక్కసారిగా కారు పై నుంచి వంతెన కిందకు దూకేశాడు. పల్టీలు కొడుతూ కిందకు దూసుకెళ్తున్న క్రమంలో అతని భుజానికి వేసుకున్న పారాచూట్ ఓపెన్ అయ్యింది. దాంతో హాయిగా గాలిలో విహరించాడు ఆ వ్యక్తి. ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది లైక్ కొడుతున్నారు. వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అతని సాహసాన్ని కీర్తిస్తున్నారు. ఇంతటి అడ్వేంచర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలని, అతని ధ్యైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

Loading...
Unable to load recommendations.
Follow Us