Viral Video: హనుమంతుడి వేషంలో అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. ఒక్క క్షణంలో కుప్పకూలి

|

Sep 04, 2022 | 2:00 PM

అప్పటివరకు అతడు హుషారుగా డ్యాన్స్ చేశాడు. అంతలోనే కుప్పకూలిపోయాడు. అసలేం జరిగిందే అర్థం కాక అక్కడున్నవాళ్లంతా అయోమయంలో పడిపోయారు.

Viral Video: హనుమంతుడి వేషంలో అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. ఒక్క క్షణంలో కుప్పకూలి
Died While Dancing
Follow us on

నెక్ట్స్ సెకన్‌కు గ్యారంటీ లేనిది జీవితం. మరణం ఎప్పుడు.. ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేం. అరక్షణంలో లైఫ్ అంతం అయిపోతుంది.అప్పటివరకు బాగానే ఉన్నవారు.. అరక్షణంలో తనువు చాలిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి అటాక్ తర్వాత ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగాయి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్(Uttar Pradesh)​ మెయిన్​పురి(Mainpuri) సమీపంలోని కొత్వాలి ప్రాంతం( Kotwali area )లో విషాదం చోటుచేసుకుంది. 35 ఏళ్ల రవి వర్మ అనే వ్యక్తి.. ఆంజనేయుడి వేషంలో అప్పటివరకు హుషారుగా గణేశ్ మండపంలో  డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్నవారిని అలరించాడు. కానీ క్షణకాలంలో కుప్పకూలిపోయి.. స్పాట్‌లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. అప్పటివరకు చలాకీగా ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా విగతజీవిగా మారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

వీడియోను దిగువన చూడండి…. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..