Watch Video: పడుకుందామని బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన యువకుడు.. దుప్పట్లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా..

సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌గా మారే కొన్ని వీడియో జనాలను ఆశ్చర్యానికి, షాకింగ్‌కు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియో మరోసారి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక వ్యక్తి పడుకుందామని బెడ్‌రూమ్‌లోకి వెళ్లగా.. దుప్పట్లో అతనికి కొన్ని కదలికలు కనిపించాయి. డౌట్‌ వచ్చి ఏంటా అని తెరిచి చూడగా.. దుప్పటి వెనక ఉన్న దాన్ని చూసి అతను షాక్‌ అయ్యాడు. ఇంతకు ఆ దుప్పటి వెనక ఏముందో తెలుసుకుందాం పదండి.

Watch Video: పడుకుందామని బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన యువకుడు.. దుప్పట్లో వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా..
Shocking Viral Video

Updated on: Sep 19, 2025 | 5:54 PM

వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లోకి పాములు వంటివి సర్వ సాధారణం. ఇవి ఎక్కువగా ఇంటి బయట, వాకిట్లో గోడలపై ఎక్కవగా కనిపిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి పడుకుందామని బెడ్‌రూమ్‌లోకి వెళ్లగా.. అతని దుప్పట్లో వింత శబ్ధాలు వినిపించాయి. ఏంటా అని దుప్పటి లాగిన ఆ యువకుడికి షాకింగ్‌ దృశ్యాలు కనిపించాయి. ఆ దుప్పట్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన పామును చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు.

ఇన్‌స్ట్రా గ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. ఒక యువకుడు బాగా అలసిపోయి పడుకుందామని బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న మంచం మీద పడుకుందామని చూశాడు. అయితే అతని దుప్పట్లో ఏదో కదులుతున్నట్టు అనిపించడంతో.. ఏంటా అని దుప్పటిని మెల్లగా లాగి చూశాడు. ఇంకేముంది లోపల ఒక పాము బుసలు కొడుతూ కనిపించింది. అది చూసి సదురు యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్‌ పామును చాకచక్యంగా పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఒక యూజర్‌ ఇన్‌స్ట్రా గ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. అతను ముందే గమనించాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత నష్టం జరిగి ఉండేదో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. వామ్మో దాన్ని చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోందని మరో యూజర్ కామెంట్ చేశాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి