
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక దెయ్యం లాంటి లిఫ్ట్ ప్రమాద వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఒక వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే అది తీవ్ర వేగంతో కిందకు పడిపోయింది. కేవలం రెండు సెకన్ల తేడాతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. ఒక వ్యక్తి లిఫ్ట్ లోపల నిలబడి ఉన్నాడు. లిఫ్ట్ ఒక ఫ్లోర్ వద్ద ఆగగానే దానంతట అదే తలుపులు తెరుచుకున్నాయి. సాధారణంగానే ఆ వ్యక్తి బయటకు రావడానికి అడుగు ముందుకు వేశాడు. అయితే, అతను బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే ఊహించని విధంగా లిఫ్ట్‌లో తీవ్రమైన ప్రకంపనలు వచ్చి, వేగంగా కిందికి దిగిపోయింది.
ఆ వ్యక్తి బయటకు రావడం, లిఫ్ట్ కిందికి పడిపోవడం మధ్య ఉన్నది కేవలం ఒకటిరెండు సెకన్ల వ్యవధి మాత్రమే! ఒకవేళ ఆ వ్యక్తి మరో రెండు సెకన్లు లిఫ్ట్ లోపలే ఉండి ఉంటే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేదని వీడియో చూస్తే అర్థమవుతోంది. అదృష్టవశాత్తు అతను సురక్షితంగా బయటపడటంతో ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దేవుడే అతడిని కాపాడాడు, మరణం ముంగిట నుంచి తిరిగి వచ్చాడు అని కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఉండే లిఫ్ట్‌ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ సెన్సార్లు, కేబుల్స్ క్రమం తప్పకుండా తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రోజువారీ జీవితంలో వాడే లిఫ్ట్‌లలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ భయానక ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..