Viral Video: ఓరెయ్ నువ్వు మనిషివా.. మానవ మృగానివా.. ముక్కుతో అంత బీర్ ఎలా తాగావ్‌రా..

మద్యం తాగడంలో కొత్త స్టైలు చూపించాడు ఓ వ్యక్తి. ముక్కుతోనే మగ్గు బీర్‌ తాగేశాడు. ఈ వింత చేష్ట వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “నువ్వు మనిషివా మృగానివా?” అని నెటిజన్లు షాక్ అవుతుండగా, వైద్యులు మాత్రం ఇది ప్రాణాపాయం అని హెచ్చరిస్తున్నారు.

Viral Video: ఓరెయ్ నువ్వు మనిషివా.. మానవ మృగానివా.. ముక్కుతో అంత బీర్ ఎలా తాగావ్‌రా..
man drinks beer through nose

Updated on: Oct 25, 2025 | 4:17 PM

ఎవడైనా దించకుండా పెగ్ తాగుతాడు.. బాగా తాగుబోతు అయినా అమాంతం కచ్చా మందు తాగేస్తాడు. వీడేంట్రా బుజ్జీ.. ముక్కుతో మగ్గు బీరు తాగేశాడు. ఈడు మాములోడు కాదురా స్వామి. వింత చేష్టలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావాలన్నా, అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవాలన్నా కొందరు చేసే పనులు చూసి ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా వ్యక్తి చేసిన పిచ్చి పనికి నెటిజన్లను బిత్తరపోయే చేసింది. ముక్కుతోనే మగ్గు బీర్‌ దించకుండా తాగేశాడు!. వీడియోలో ఆ వ్యక్తి బీర్‌ మగ్గును తీసుకుని నోటికి కాకుండా ముక్కుకి దగ్గరపెట్టి, ముక్కుతో బీర్‌ పీలుస్తూ కనిపించాడు. అతడి స్నేహితులు పక్కనే కూర్చుని వీడియోలు తీస్తే కనిపించారు. ఈ వీడియో ప్రజెంట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఓరెయ్ నువ్వు మనిషివా.. మానవ మృగానివా.. అలా ఎలా తాగావ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ముక్కుతోనే అంత తాగాడు అంటే.. నోటితో ఇంకెంత తాగుతాడో మహానుభావుడు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఇలాంటి పనులు ప్రాణాపాయం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కు ద్వారా ఆల్కహాల్‌ శరీరంలోకి వెళితే, సైనస్‌, నర్వ్‌ డ్యామేజ్‌, బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌ ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. బీర్ ఫుడ్ పైప్‌లోకి కాకుండా ఎయిర్ పైప్‌లోకి వెళ్తే బీర్ అంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరి ఆడక చనిపోతారని అంటున్నారు. ముక్కుతో బీర్‌ తాగడం వింతగా కనిపించినా, దాని వెనుక పెను ప్రమాదం దాగి ఉంది. మీరు ఇలాంటి ప్రయత్నాలు అసలు చేయకండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.