వృద్ధ దంపతులు సీటు అడిగితే రూ.1,050 డిమాండ్.. రైలులో యువకుడి తీరుపై నెట్టింట రచ్చ!

భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు సీట్లు మార్చుకోవడం సాధారణ విషయమే. సాధారణంగా వృద్ధులు లేదా గర్భిణులు అడిగినప్పుడు తోటి ప్రయాణికులు మానవత్వంతో లోయర్ బెర్త్‌ను ఇచ్చేస్తుంటారు. అయితే, ఇటీవల 3AC కోచ్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

వృద్ధ దంపతులు సీటు అడిగితే రూ.1,050 డిమాండ్.. రైలులో యువకుడి తీరుపై నెట్టింట రచ్చ!
Train Seat Controversy

Updated on: Oct 07, 2026 | 9:24 PM

రైలు ప్రయాణంలో 3AC సైడ్ లోయర్ బెర్త్ కోసం ఒక యువకుడు వృద్ధ దంపతులకు ఇచ్చిన షాకింగ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలులో ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులు తమకు సైడ్ లోయర్ సీటు ఇవ్వమని ఒక యువకుడిని కోరగా, అతడు ఉచితంగా ఇవ్వడానికి నిరాకరించాడు. పైగా సీటు కావాలంటే టికెట్ ధరలో 50 శాతం అంటే రూ. 1,050 చెల్లించాలని షరతు విధించాడు. దీంతో ఆశ్చర్యపోయిన వృద్ధ దంపతులు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయారు. ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా చర్చిస్తున్నారు. అసలు ఏం జరిగింది?

పూజ అనే సోషల్ మీడియా వినియోగదారు తెలిపిన వివరాల ప్రకారం… ఆమె 3AC కోచ్‌లోని ఒక అప్పర్ బెర్త్ ప్రయాణిస్తూ ఉంది. అదే సమయానికి ఎదురుగా సైడ్ లోయర్ బెర్త్‌పై ఒక యువకుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక వృద్ధ దంపతులు తమకు లోయర్ బెర్త్ అవసరమని, సీటు మార్చుకోవాలని ఆ యువకుడిని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

యువకుడు సీటు ఇస్తాడని అందరూ భావించారు, కానీ అతడు ఊహించని మెలిక పెట్టాడు. అంకుల్, నేను ఈ సీటు కోసం రూ. 2,100 చెల్లించాను. మీకు నా సైడ్ లోయర్ సీటు నిజంగా కావాలంటే, టికెట్ ధరలో 50% అంటే రూ. 1,050 ఇచ్చి కూర్చోండి అని స్పష్టంగా చెప్పాడు. యువకుడి వ్యాపార ధోరణి విని ఆశ్చర్యపోయిన వృద్ధ దంపతులు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే రెండు వర్గాలుగా నెటిజన్లు విడిపోయారు. కొందరు యువకుడి వైఖరిని సమర్థిస్తున్నారు. ప్రయాణ ప్రణాళికను ముందుగా చూసుకోకుండా వేరొకరు డబ్బులు పెట్టి బుక్ చేసుకున్న సీటును ఉచితంగా ఆశించడం సరికాదని, సైడ్ లోయర్ బెర్త్ దొరకడం చాలా కష్టమని భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరికొందరు ఆ యువకుడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణాలలో మానవత్వం, వృద్ధుల పట్ల మర్యాద ఉండాలని, ప్రతి విషయాన్ని డబ్బుతో కొలవడం సమాజానికి మంచిది కాదని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇలా సీటును విక్రయించడం రైల్వే నిబంధనల ప్రకారం నేరమని, అతడిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us