Punjab State Lottery: పేదరికంలో మగ్గుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఈ క్రమంలో ఎప్పుడైనా అదృష్టం దక్కక పోతుందా అనే ఉద్దేశ్యంతో 34 ఏళ్లుగా లాటరీ కొంటూనే ఉన్నాడు. కానీ ప్రతీ ఏడాది అతనికి నిరాశే ఎదురవుతోంది. అతని పనికి భార్య కూడా అభ్యంతరం తెలుపుతూ వచ్చింది. ఈ తరుణంలో అతని జాక్‌పాట్ తగిలింది. లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్లను గెలుచుకున్నాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పంజాబ్‌లోని భటిండా నివాసి రోషన్ సింగ్.. ఇటీవల పంజాబ్ బైసాకి బంపర్ లాటరీ 2022 తీసుకున్నాడు. తాజాగా.. ఈ లాటరీ నెంబర్ల ఫలితాలు విడుదలయ్యాయి. వెంటనే డీలర్ రోషన్ కి ఫోన్ చెప్పడంతో ఆయన నమ్మలేకపోయాడు. బైసాకి బంపర్ లాటరీ 2022 గెలుచుకోవడంపై రోషన్ ఆనందం వ్యక్తంచేస్తున్నాడు. గత 34 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నానని ఎప్పుడు కూడా కలవలేదని రోషన్ తెలిపాడు. తాను అంతకుముందు వేరే వ్యక్తుల వద్ద పనిచేసేవాడినని.. ప్రస్తుతం దుస్తుల దుకాణాన్ని నడుపుతున్నానని తెలిపాడు. ఇన్ని సంవత్సరాలల్లో అప్పుడప్పుడు రూ.100-200 వచ్చేవని తెలిపాడు.
లాటరీ విషయం తెలుసుకోని రోషన్ భార్య సంతోషం వ్యక్తంచేసింది. తన భర్త ఎట్టకేలకు లాటరీ గెలుపొందారంటూ ఆమె పేర్కొంది. ఇన్నేళ్ల నుంచి లాటరీ వద్దంటూ సూచించానని.. పేర్కొంది. కాగా.. ఈ లాటరీ మొత్తంలో పన్ను మినహాయించగా రూ.1.75 కోట్లు వస్తాయని.. ఇదంతా దేవుడి దయతోనే జరిగిందని రోషన్ తెలిపాడు. ఈ డబ్బులతో ముగ్గురు పిల్లలను ఉన్నతంగా చదివిస్తానని.. మంచి భవిష్యత్తు అందిస్తానని తెలిపారు. దీంతోపాటు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రణాళిక చేస్తున్నట్లు వార్త సంస్థ బీబీసీకి తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: