కునో నేషనల్ పార్క్‌లో చిరుతల దప్పిక తీర్చిన పాపానికి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్!

పుణ్యం చేయబోతే.. పాపం ఎదురైంది అన్నట్లు తాజాగా ఓ ఘటనతో అర్థమైంది. వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలతో తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నీటి జాడ కోసం మూగజీవాలు తల్లడిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి ప్రేమికులు వాటి సంరక్షణ కోసం ఆహారం, నీరు వసతులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ డ్రైవర్ మూగజీవాల పట్ల జాలి చూపినందుకు ఉద్యోగాన్నే పొగొట్టుకున్నాడు.

కునో నేషనల్ పార్క్‌లో చిరుతల దప్పిక తీర్చిన పాపానికి ఉద్యోగం పోగొట్టుకున్న డ్రైవర్!
Feeding Water To Leopards

Updated on: Apr 06, 2025 | 3:06 PM

పుణ్యం చేయబోతే.. పాపం ఎదురైంది అన్నట్లు తాజాగా ఓ ఘటనతో అర్థమైంది. వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలతో తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నీటి జాడ కోసం మూగజీవాలు తల్లడిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి ప్రేమికులు వాటి సంరక్షణ కోసం ఆహారం, నీరు వసతులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ డ్రైవర్ మూగజీవాల పట్ల జాలి చూపినందుకు ఉద్యోగాన్నే పొగొట్టుకున్నాడు. అయితే అతను చిరుతలకు నీరు అందించినందుకు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలోని ఒక గ్రామానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి చిరుతలకు నీళ్లు అందించాడు. దీనిపై పార్క్ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేసి చర్యలు చేపట్టారు. ఆ వీడియో దాదాపు 40 సెకన్ల నిడివి ఉంది. ఇందులో, ఒక వ్యక్తి డబ్బా నుండి నీటిని ఒక పాత్రలోకి పోశాడు. దీంతో సమీపంలోని నీడలో కూర్చున్న ఐదు చిరుతలు పాత్ర దగ్గరకు వచ్చి నీరు త్రాగడం ప్రారంభించాయి. ఆ వ్యక్తి మొదట్లో చిరుతల దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తున్నట్లు కనిపించింది. కానీ అతని వెనుక నిలబడి ఉన్న వ్యక్తులు, వీడియో తీసిన వ్యక్తితో సహా, చిరుతలకు నీళ్లు ఇవ్వమని సూచించారు.

వైరల్ వీడియో చూడండి..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. కునో జాతీయ పార్క్‌లోని చీతాలకు నీరు అందించినట్లు అధికారులు నిర్ధారించారు. చెట్టు కింద సేద తీరుతున్న జ్వాలా అనే చిరుత దాని నాలుగు పిల్లలకు నీరు అందిస్తూ తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని’’.. ‘‘మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి’’.. ‘‘ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంది’’ అంటూ కామెంట్లు చేశారు. అయితే ఓ వైపు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్న వేళ.. ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ తల్లి చిరుత దాని పిల్లలు ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో ఆ మూగజీవాలు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలోనే వాటికి నీటిని అందిస్తున్న వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం, భారత గడ్డపై జన్మించిన 11 పిల్లలతో సహా 17 చిరుతలు KNP వద్ద అడవిలో తిరుగుతుండగా, తొమ్మిది చిరుతలు ఎన్‌క్లోజర్లలో ఉన్నాయి. సెప్టెంబర్ 17, 2022న ఎనిమిది నమీబియన్ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు, మూడు మగ చిరుతలను KNPలో విడుదల చేశారు. ఇది మొట్టమొదటి ఖండాంతర చిరుతల మార్పిడి. ఫిబ్రవరి 2023లో, దక్షిణాఫ్రికా నుండి అభయారణ్యంలోకి మరో 12 చిరుతలను తరలించారు. రక్షిత అడవిలో ఇప్పుడు 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో 14 భారతదేశంలో జన్మించిన పిల్లలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..