అర్థరాత్రి దాహం వేసి ఫ్రిజ్‌ వైపు వెళ్లిన వ్యక్తి.. కనిపించిన సీన్ చూసి షాక్!

|

Apr 05, 2025 | 6:31 PM

వన్యప్రాణులను చూడాలనుకుంటే ఔత్సాహికులకు, సఫారీలు, జూపార్క్‌లకు వెళ్లి చూస్తుంటారు. అయితే, అడవి రారాజు ఏకంగా ఓ ఇంట్లోకి దూరింది. కిచెన్ లోపలికి ప్రవేశించి, ఫ్రిజ్‌పై తిష్ట వేసి కూర్చుంది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని ఒక కుటుంబం రాత్రిపూట తమ వంటగదిలో సింహాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అవడంతో ముప్పు తప్పింది.

అర్థరాత్రి దాహం వేసి ఫ్రిజ్‌ వైపు వెళ్లిన వ్యక్తి.. కనిపించిన సీన్ చూసి షాక్!
Lion Viral Video
Follow us on

సోషల్ మీడియాలో మీరు వివిధ రకాల వీడియోలను చూసే ఉంటారు. వీటిలో కొన్ని చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొన్ని మనల్ని ఆకర్షిస్తుంటాయి. కొన్ని సార్లు అలాంటి దృశ్యాలను చూసేందుకు కళ్ళను పెద్దగా చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని వీడియోలను చూసి కూడా నమ్మలేం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక సింహం ఒకరి ఇంట్లోకి ప్రవేశించింది. ఏకంగా వెళ్లి ఫ్రిజ్ పైన కూర్చుంది. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనను చూసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా రాత్రిపూట ప్రజలు నిద్రపోతున్నప్పుడు.. దాహం వేస్తే, అకస్మాత్తుగా మేల్కొంటారు. అయితే చాలా మంది నీళ్లు దగ్గర పెట్టుకుని నిద్రపోరు. అటువంటి పరిస్థితిలో, వారు నీరు తీసుకురావడానికి ఫ్రిజ్‌ దగ్గరు వెళ్ళవలసి ఉంటుంది. చాలా సార్లు ప్రజలు అకస్మాత్తుగా రాత్రిపూట ఏదైనా తినాలని కోరుకుంటారు. అలాంటి పరిస్థితిలో, ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులను తినాలని అనిపిస్తుంది. కానీ మీరు రాత్రి నిద్రపోతూ మేల్కొన్న తర్వాత ఫ్రిజ్ నుండి నీటి బాటిల్ లేదా తినడానికి ఏదైనా తీసుకోవాలనుకుంటే, ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి కాక మానదు. ఫ్రిడ్జిపై తిష్టవేసి కూర్చొంది మృగరాజు.

దాహం వేస్తే ఫ్రిడ్జి వైపు వెళ్లాలనుకుంటారు చాలా మంది. డోర్ తెరిచిన వెంటనే, ఫ్రిజ్ పైన ఒక ఆకారం కనిపించిందనుకోండి. ఆ ముఖం తీక్షణంగా గమనిస్తే, అడవి రాజు సింహం కళ్లముందు కనిపించింది. అప్పుడు మీరు బలహీన హృదయులైతే ఏమి చేస్తారు? మీకు గుండెపోటు రావడం ఖాయం. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఇలాంటిదే జరిగింది. అక్కడ ఒక సింహం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఫ్రిజ్‌పై కూర్చుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో చూడండి.. 

 

ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో @piyushk51868979 అనే ఖాతా నుండి షేర్ చేశారు. ఈ వీడియోలో సింహం ఇంట్లోకి ఎలా ప్రవేశించి, వంటగదిలోకి వెళ్లి, ఫ్రిజ్ పైన ఎలా కూర్చుందో స్పష్టంగా చూడవచ్చు. సింహాన్ని చూసిన తర్వాత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భయపడిపోయిన ఇంట్లోని ఒక సభ్యుడు దూరం నుండి తన ఫోన్‌లో సింహం వీడియో తీశాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాకు చెందినదని చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..