ఫస్ట్ డేట్‌కు రూ.లక్ష ఖర్చు.. బట్టతల చూసి రిజెక్ట్‌! చివరికి యువకుడు చేసిన పనికి షాక్‌!

సోషల్ మీడియాలో ఒక ఖరీదైన ఫస్ట్ డేట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి డేట్ చేసినా, ఆ మహిళ అతడి బట్టతల కారణంగా తిరస్కరించింది. దాంతో, డేట్ ఖర్చును తిరిగి చెల్లించమని అతడు డిమాండ్ చేయడంతో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ప్రేమకు ఖర్చుతో సంబంధం ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.

ఫస్ట్ డేట్‌కు రూ.లక్ష ఖర్చు.. బట్టతల చూసి రిజెక్ట్‌! చివరికి యువకుడు చేసిన పనికి షాక్‌!
After The Date, The Couple Rejected
Image Credit source: X/@TRHLofficial

Updated on: Oct 11, 2026 | 8:25 PM

సోషల్ మీడియాలో ఓ ఖరీదైన ఫస్ట్ డేట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన తొలి భేటీని ప్రత్యేకంగా మార్చేందుకు ఓ వ్యక్తి విలాసవంతమైన కారును ఏర్పాటు చేయడంతో పాటు, ఖరీదైన రెస్టారెంట్‌లో టేబుల్ రిజర్వ్ చేసి ఆహారం, పానీయాల కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశాడని సమాచారం. అయితే, డేట్ బాగానే సాగినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఆ మహిళ అతడితో సంబంధాన్ని కొనసాగించేందుకు నిరాకరించిందని చెబుతున్నారు. దీనికి అతడి బట్టతల కారణమని ఆమె పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత డేట్ ఖర్చు తిరిగి చెల్లించాలంటూ ఆ వ్యక్తి కోరినట్లు వచ్చిన ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

విలాసవంతమైన ఏర్పాట్లు.. అయినా నో చెప్పిన మహిళ

సోషల్ మీడియా X వేదికగా @raqisright అనే ఖాతా నుంచి ఈ అనుభవానికి సంబంధించిన పోస్టులు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి ఆమెను తీసుకెళ్లేందుకు విలాసవంతమైన కారును ఏర్పాటు చేశాడు. రెస్టారెంట్‌లో ముందుగానే బుకింగ్ చేయడంతో పాటు, డేట్ సమయంలో అన్ని ఏర్పాట్లనూ తానే చూసుకున్నట్లు యువతి తెలిపింది. తన కోసం కారు తలుపు తెరవడం, ఆహారం, పానీయాలను ఆర్డర్ చేయడం వంటి మర్యాదపూర్వక చర్యలు చేపట్టాడని ఆమె వివరించింది. అతడితో ఉన్నప్పుడు తనకు సురక్షితంగా అనిపించిందని కూడా పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఆ వ్యక్తి పట్ల ఆకర్షణ కలగలేదని, అతడిని స్నేహితుడిగానే చూడాలనుకుంటున్నట్లు ఆమె నిర్ణయించుకుంది. అతడికి బట్టతల ఉండటమే ఇందుకు కారణమని చెప్పినట్లు కథనం పేర్కొంది.

రూ.లక్ష తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్?

ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వ్యక్తి తన డేట్ కోసం ఖర్చు చేసిన 1,050 డాలర్లు, అంటే సుమారు రూ.లక్షకు పైగా తిరిగి ఇవ్వాలని కోరినట్లు మహిళ మరో పోస్టులో ఆరోపించింది. దీంతో ఖరీదైన డేట్‌కు అయిన ఖర్చును తిరస్కరణ తర్వాత తిరిగి అడగడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఖరీదైన ఏర్పాట్లకు అంగీకరించే ముందు మహిళ ఆలోచించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం డేట్‌కు వెళ్లడం, ఎదుటివారి ఆతిథ్యాన్ని స్వీకరించడం అంటే వారితో ప్రేమ సంబంధానికి అంగీకరించినట్లు కాదని అంటున్నారు.

డబ్బు ఖర్చు చేస్తే సంబంధం తప్పనిసరా?

ఈ ఘటన వ్యక్తిగత ఆకర్షణ, డేటింగ్ మర్యాదలు, ఖర్చుల విషయంలో బాధ్యత వంటి అంశాలపై చర్చకు దారితీసింది. ఖరీదైన బహుమతులు లేదా డేట్ ఏర్పాట్లు చేసినంత మాత్రాన ఎదుటివారు సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఇరువురి వాదనల పూర్తి వివరాలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. వీరి యవ్వారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us