Viral Video: పొట్లకాయను పట్టుకున్నట్లు ఈజీగా పామును పట్టేసిందిగా..

సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం కాబట్టి పాములు, కీటకాలు ఇళ్లు, ఆఫీసుల్లోకి ఎక్కువగా చేరతాయి. అయితే అవి కనిపించనంత వరకూ ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఒక్కసారి కనిపిస్తే.. చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. మనపై అవి దాడి చేస్తాయని మనం కంగారు పడితే..

Viral Video: పొట్లకాయను పట్టుకున్నట్లు ఈజీగా పామును పట్టేసిందిగా..
Viral Video (1)
Follow us

|

Updated on: Jul 26, 2024 | 4:41 PM

సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం కాబట్టి పాములు, కీటకాలు ఇళ్లు, ఆఫీసుల్లోకి ఎక్కువగా చేరతాయి. అయితే అవి కనిపించనంత వరకూ ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఒక్కసారి కనిపిస్తే.. చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. మనపై అవి దాడి చేస్తాయని మనం కంగారు పడితే.. వాటిపై మనుషులు దాడి చేస్తారని పాములు కంగారు పడుతూ ఉంటాయి. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన మరో వీడియో వైరల్‌గా మారింది.

తాజాగా ఓ పాము ఆఫీసులోకి దూరింది. కంప్యూటర్‌ వెనుక దాగుంది. అది చూసిన జనం షాక్ అయి.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు కబురు పంపారు. అప్పుడు ఓ యువతి వచ్చి.. ఏదో పొట్లకాయను పట్టుకున్నట్టు నవ్వుతూ ఈజీగా పామును పట్టుకుంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేతులతో ఈజీగా మెల్లిగా పట్టుకుంది. పాము దొరకడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

యువతి ఆ పామును పట్టుకునే విధానం చూస్తుంటే.. ఆమెకు పాములు పట్టడంలో ఎంత పర్ ఫెక్ట్ అనేది తెలుస్తుంది. బిలాస్ పూర్‌కు చెందిన అజిత అనే అనే యువతి.. ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈమె వృత్తి పాముల్ని పట్టడం. ఆమె ఇన్ స్టా ఖాతాలో ఇలాంటి వాటికి సంబంధించిన వీడియో చాలా ఉన్నాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. మరి ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.