King Cobra: అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..

కింగ్ కోబ్రా ఒక్కసారి బుస కొట్టిందంటే ఎంతటి ధైర్యవంతుడికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సాధారణంగా అడవుల్లో ఉండే ఈ పాములు, ఆహారం కోసం లేదా దారి తప్పి అప్పుడప్పుడు నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. ఒకవేళ పొరపాటున మీరు నడుస్తున్న దారిలో ఈ భయంకరమైన కింగ్ కోబ్రా మీకు ఎదురైతే ఏం చేయాలి? భయంతో పరుగులు తీయాలా? లేక నిశ్చలంగా నిలబడాలా? అనేది తెలుసుకుందాం..

King Cobra: అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..
What To Do If You See A King Cobra

Updated on: Mar 07, 2026 | 12:15 PM

ప్రకృతిలో అత్యంత గంభీరమైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో కింగ్ కోబ్రా ఒకటి. అడవులకు సమీపంలో ఉండేవారికి లేదా ట్రెకింగ్‌కు వెళ్లేవారికి అప్పుడప్పుడు ఇవి ఎదురవుతుంటాయి. రాచనాగు కంటికి ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. అది రెప్పపాటులో దాడి చేయగలదు. ఒకవేళ పొరపాటున ఇది మీకు ఎదురైతే.. భయపడి పరుగులు తీయకుండా ప్రాణాలతో బయటపడటానికి వన్యప్రాణి నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు పాటించండి.

సురక్షిత దూరం – ప్రశాంతత

రాజనాగును చూసిన వెంటనే కనీసం ఐదు నుండి పది మీటర్ల దూరం జరిగేలా చూసుకోండి. అవి నిశ్చలంగా ఉన్నట్లు అనిపించినా వాటి వేగం ఊహకందని విధంగా ఉంటుంది. ఫోన్లలో ఫోటోలు తీయడం కంటే దూరంగా ఉండి గమనించడమే ఉత్తమం.

కస్మిక కదలికలు వద్దు

పాము ముందు ఒక్కసారిగా పరిగెత్తడం లేదా చేతులు ఊపడం వంటివి చేయకండి. ఇలాంటి కదలికలను అవి దూకుడుగా భావించి ఎదురుదాడికి దిగుతాయి. మీరు కదలకుండా ఉంటే మీరు తనకు ముప్పు కాదని పాము భావిస్తుంది.

నెమ్మదిగా వెనక్కి తగ్గండి

పాము వైపు నుంచి మీ దృష్టిని మళ్లించకుండా నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయండి. వీపు తిప్పకుండా వెనక్కి తగ్గడం వల్ల పాము కదలికలను గమనిస్తూ సురక్షిత ప్రాంతానికి చేరుకోవచ్చు.

పాము బాడీ లాంగ్వేజ్‌ను గమనించండి

రాచనాగు దాడి చేసే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. పడగ విప్పడం, బుసలు కొట్టడం లేదా శరీరాన్ని గాలిలోకి లేపి ఊగడం వంటివి చేస్తే అది దాడికి సిద్ధంగా ఉందని అర్థం. అప్పుడు ఏమాత్రం రెచ్చగొట్టకుండా వెనక్కి వెళ్లడం శ్రేయస్కరం.

ఇతరులను అప్రమత్తం చేయండి

మీరు పామును చూసినప్పుడు భయపడి కేకలు వేయకుండా సమీపంలోని వారిని ప్రశాంతంగా హెచ్చరించండి. దీనివల్ల ఇతరులు ప్రమాదవశాత్తు పాము మీదకు వెళ్లకుండా ఉంటారు. ముఖ్యంగా పెంపుడు జంతువులను వాటి దగ్గరికి తీసుకెళ్లకండి.

నిపుణుల సహాయం తీసుకోండి

పామును మీరే పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకండి. రాచనాగు నివాస ప్రాంతాల్లోకి వస్తే వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వండి. వారు సురక్షితంగా దానిని అడవిలోకి పంపుతారు. పాములు ఉద్దేశపూర్వకగా మనుషులపై దాడి చేయవు. మనం వాటి జోలికి వెళ్లనంతవరకు అవి కూడా తమ దారిన తాము వెళ్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us