
Trending: విచిత్రమైన జీవులు కెమెరాల్లో చిక్కిన ఘటనలు గురించి చర్చలు మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. తాజాగా అలాంటిదే మరో ఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(USA)లోని కెంటుకీలోని మోర్‌హెడ్‌లో వెలుగుచూసింది. ఓ భయానక జీవి వీడియో ప్రజంట్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు, పారానార్మల్ అభిమానుల మధ్య చర్చకు దారితీసింది. పారానార్మాలిటీ మ్యాగజైన్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయ్యింది. 33-సెకన్ల ఫుటేజ్‌లో అపార్ట్‌మెంట్ వెనుక యార్డ్‌కు సమీపంలో ఒక తెల్లటి మానవుడి లాంటి విచిత్రమైన జీవి తచ్చాడటం మీరు చూడవచ్చు. ఆపై ఇంటి యజమాని వాహనం దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్తగా చుట్టూ చూస్తూ ఆ జీవి ముందుకు వెళ్లడం అందులో కనిపిస్తుంది. ఈ వింత వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఫుటేజీని చూసి ట్విటర్ యూజర్లు అవాక్కయ్యారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ.. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇది ఒట్టి డొల్ల ఎడిటడ్ వీడియో అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. సీసీ కెమెరాల క్వాలిటీ పెరిగినప్పటికీ.. ఈ పుటేజీ క్లారిటీ ఎందుకు లేదని ప్రశ్నించాడు. “ఇలాంటి వింత జీవులన్నింటికీ వెన్ను సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అవి వంగి నడుస్తాయి అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు”. కొంతమంది మాత్రం అది గ్రహంతర జీవి అని.. మానవుల మనగడ ఇకపై ప్రశ్నార్థకంగా మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు అది దెయ్యం అని భయపడుతున్నారు. (Source)
Viral
Here’s the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..