పురుషుల్లో ఉర్ఫీ జావేద్ దొరికాడోచ్‌..! అతడి వెరైటీ డ్రెస్‌తో ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తున్నాడు..

|

Dec 03, 2024 | 8:17 PM

ఇతడి ఫ్యాషన్ స్టైల్ సోషల్ మీడియాలో తన చిత్ర విచిత్రమైన ఫ్యాషన్‌కు పేరుగాంచిన ఉర్ఫీ జావేద్‌ని గుర్తు చేస్తుంది. ఈ పోస్ట్‌కు 762000 వీక్షణలు, 16000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. దీంతో పాటు ఈ వీడియోపై ప్రజలు చాలా ఫన్నీ కామెంట్స్ చేశారు.

పురుషుల్లో ఉర్ఫీ జావేద్ దొరికాడోచ్‌..! అతడి వెరైటీ డ్రెస్‌తో ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తున్నాడు..
Male Version Of Uorfi Javed
Follow us on

ఉర్ఫీ జావేద్.. దాదాపుగా ఈ పేరు అందరికీ సుపరిచితమే అని చెప్పాలి. ఎందుకంటే.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన ఈ నటి.. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. రోజుకో కొత్త ఫ్యాషన్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌తో నెటిజన్లకు ఎప్పటికప్పుడు షాకిలిస్తుంటారు. ఆమె ప్రత్యేకమైన శైలి, ఫ్యాషన్ సెన్స్ కారణంగా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే బాగా పాపులారిటీ సాధించారు. అలాగే, పురుషుల్లోనూ ఉర్ఫీజావేద్‌ స్టైల్లో ఉన్న వ్యక్తిని మీరేప్పుడైనా చూశారా..? అవును ఉర్ఫీజావేద్‌ లాంటి వెరైటీ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఉర్ఫీ జావేద్‌ గుర్తొస్తున్నారంటూ వ్యాఖ్యనించారు.

సోషల్ మీడియాలో తన వింత ఫ్యాషన్‌కు ప్రసిద్ధి చెందిన నానావత్ తరుణ్ ఇటీవల డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. అతడు ఒంటి నిండా చేపలతో చేసిన ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఓ రీల్‌ క్రియేట్‌ చేశాడు. దానిని సోషల్ మీడియాలో కూడా షేర్‌ చేశాడు. పైగా అతడు ఒంటిపై ధరించినవన్నీ నిజమైన చేపలే. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

తరుణ్ స్వయంగా చేపలతో చేసిన స్లీవ్‌లెస్ దుస్తులను తయారు చేసుకున్నట్టుగా చెప్పాడు. అతడు తన భుజాలపై నుండి పాదాల వరకు అతడు చేపలతో చేసిన పట్టీలతో శరీరాన్ని కప్పి ఉంచాడు. ఇందులో ఎలాంటి ఫాబ్రిక్ ఉపయోగించలేదు. పైగా అతడు ఒక చేపను బ్యాగ్‌లా హ్యాండిల్ ఏర్పాటు చేసుకుని పట్టుకున్నాడు. అది అచ్చం హ్యాండ్ బ్యాగ్‌ లాగా కనిపిస్తుంది.

తరుణ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేటెస్ట్ ఫ్యాషన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. తరుణ్ ఫ్యాషన్ సెన్స్ మనకు సోషల్ మీడియాలో తన చిత్ర విచిత్రమైన ఫ్యాషన్‌కు పేరుగాంచిన ఉర్ఫీ జావేద్‌ని గుర్తు చేస్తుంది. ఈ పోస్ట్‌కు 762000 వీక్షణలు, 16000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. దీంతో పాటు ఈ వీడియోపై ప్రజలు చాలా ఫన్నీ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..