Viral Video: హృదయాలను హత్తుకునే వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

మధ్య తరగతి అబ్బాయిల జీవితం అనుకున్న సులభంకాదు.. ఫ్యామిలీ కోసం తమ కలలన్నీ పక్కన పెట్టి.. కడుపు మాడినా దాన్ని పక్కవారికి చెప్పకుండా కష్టపడడం వారికి మాత్రమే సాధ్యం.. ప్రస్తుతం ఈ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూసించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తే మీరు కన్నీరు పెట్టక ఆగరు.

Viral Video: హృదయాలను హత్తుకునే వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
Middle Class Struggles

Updated on: Sep 04, 2026 | 4:19 PM

మధ్యతరగతి అబ్బాయిల జీవితం బయటకు కనిపించేంత సులభం కాదు. ఎంత కష్టం వచ్చినా పక్కవారికి చెప్పుకోలేరు, కుటుంబ బాధ్యతల నడుమ ఎంతటి కష్టం వచ్చినా ఎవరికీ చూపించకుండా భరిస్తూ ముందుకు సాగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవున్న ఓ వీడియో సైతం అచ్చం అలాంటి పరిస్థితినే కళ్లకు కట్టినట్టు చూపింది. కుటుంబాన్ని పోషించేందుకు కూలీ పనుల కోసం ఊరుకాని ఊరు వచ్చి కష్టపడుతున్న ఓ కుర్రాడు.. దొంగతనంగా తన ఆకలిని తీర్చుకుంటున్న దృశ్యం నెటిజన్లను కంటతడి పెట్టకుండా ఆపట్లేదు.

రుద్ర యాదవ్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. సిమెంట్ బస్తాలు మోస్తున్న ఓ యువకుడి ఆకలిని తట్టుకోలేక కాసేపు ఆగి తినడం స్టార్ట్ చేశాడు.. సరిగ్గా అదే సమయంలో అతని యజమాని అక్కడికి రావడంతో, ఆ యువకుడు తన చేతిలోని ఆహారాన్ని వెనక్కి దాచిపెట్టాడు. అది చూసిన ఓనర్ అతని వద్దకు వచ్చి ఏం తింటున్నావు, చూపించు? అని అడిగాడు. దీంతో ఆ యువకుడు భయపడుతూ తన చేతిలో ఉన్న ఎండు రొట్టెను, పచ్చి ఉల్లిపాయను చూపిస్తూ మొహం చిన్నబుచ్చుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొన్ని క్షణాల్లోనే ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతే పేద, మధ్యతరగతి యువకుల జీవితం ఇలానే ఉంటుంది.. ఇలాంటి జీవితం గడపడం అందరికి సాధ్యం కాదు.. ఫ్యామిలీ కోసం, బాధ్యతలను భుజాన మోయడం కేవలం వాళ్లకు మాత్రమే సాధ్యమని కామెంట్స్ చేశారు. ఈ దృశ్యం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు అని మరొ యూజర్ కామెంట్ చేశారు. జీవితం అంటే ఏమిటో, పేదరికం ఎలా ఉంటుందో ఈ వీడియో కళ్లకు కట్టినట్టూ చూపిస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us