Shocking News: వాషింగ్ మెషిన్ నుండి పెద్ద పెద్ద శబ్ధాలు.. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే గుండె గుభేల్ అంది..!

|

Sep 19, 2021 | 10:29 PM

Shocking News: ఆస్ట్రేలియాలో పాములు సర్వసాధారణం. ఎక్కడ పడితే అక్కడ పాములు దర్శనిమిస్తుంటాయి.

Shocking News: వాషింగ్ మెషిన్ నుండి పెద్ద పెద్ద శబ్ధాలు.. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే గుండె గుభేల్ అంది..!
Snakes
Follow us on

Shocking News: ఆస్ట్రేలియాలో పాములు సర్వసాధారణం. ఎక్కడ పడితే అక్కడ పాములు దర్శనిమిస్తుంటాయి. బాత్రూమ్ మొదలు.. ఇంటి పైకప్పు, బాలక్కనీ ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిస్తాయి. ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఎక్కడ పాము కనిపిస్తుందనే చెప్పలేం. తాజాగా ఓ మహిళ భయానక పరిస్థితిని ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో నివసిస్తున్న ఒక మహిళ తన ఇంట్లో జరిగిన ఒక వింత సంఘటను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రెండు పాములు తన ఇంట్లోని వాషింగ్ మిషిన్‌లోకి దూరి సయ్యాటలాడినట్లు సదరు మహిళ పేర్కొంది.

మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో కైలీ కోట్స్ అనే మహిళన తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అయితే, ఇటీవల ఒక రోజు ఉన్నట్లుండి ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ నుంచి పెద్ పెద్ద శబ్ధాలు రావడం మొదలైంది. ఆ శబ్ధాలు విన్న మహిళ.. మొదట కాస్త కంగారు పడింది. ఏంటా అని గదిలోకి వెళ్లి వాషింగ్‌ మెషిన్‌ క్యాప్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని పాములు సయ్యాట ఆడుతున్నట్లు గమనించింది. తొలుత భయపడినా.. కాస్త ధైర్యం చేసింది ఆ మహిళ. ఆ పాములను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలా పాముల ఫోటోలను షేర్ చేసిన సదరు మహిళ.. ఇది పాముల సెక్స్ పార్టీ(పాముల సయ్యాట) కదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూ క్యాప్షన్ పెట్టింది.

ఇదిలాఉంటే.. పాములను చూసి ఆందోళనకు గురైన మహిళ వెంటనే యానిమల్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించింది. వారు వెంటనే మహిళ ఇంటికి వచ్చి.. వాషింగ్ మెషిన్‌లో ఉన్న పాములను బందించారు. ఓ సంచిలో వేసి.. అనంతరం వాటిని అడవిలో వదిలిపెట్టారు. అయితే, తన ఇంటికి తరచుగా ఒకటి రెండు పాములు వస్తూనే ఉంటాయని కైలీ చెప్పుకొచ్చింది. తమ ఇంటి తోటలో ఉండే కప్పలు, ఇతర కీటకాలను తినేందుకు పాములు వస్తుంటాయని తెలిపింది. కానీ, తొలిసారి భారీగా పాములు కనిపించడంతో షాక్‌కు గరయ్యానంది.

అయితే, ఈ ఫోటోలను కైల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కైలీని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఇలాంటి తాను రియల్‌గా చూసిందే అదే నా జీవితంలో చివరి క్షణం అయ్యి ఉండేది అంటూ ఓ నెటిజన్ భయంతో కామెంట్ పెట్టారు. మరికొందరు పాములేమీ ప్రమాదకరం కాదని అన్నారు. మొత్తంగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

Also read:

Skin Problems-Ayurveda Tips: సాధారణ చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా సైడ్‌ఎఫెక్ట్స్‌లేని ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

Monkey Video: అయ్యో పాపం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కున్న కోతి పిల్ల.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.