Photo Puzzle: మీ కళ్ల పవర్ ఏ పాటిది? ఈ ఫోటోలో ‘8’ నెంబర్ కనిపెట్టగలరా!

|

Jan 23, 2023 | 6:11 PM

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ట్విట్టర్ వరకు..

Photo Puzzle: మీ కళ్ల పవర్ ఏ పాటిది? ఈ ఫోటోలో 8 నెంబర్ కనిపెట్టగలరా!
Photo Puzzle
Follow us on

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ట్విట్టర్ వరకు.. ఇలా ప్రతీదానిలోనూ అందరూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక మీకు కొత్తగా చెప్పేదేముంది.. ఇటీవల ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు ఉరఫ్ ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది తమ పని ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు వీటిని ఓ పట్టు పడుతున్నారు కూడా. అయితే ఇవి అలాంటి.. ఇలాంటి పజిల్స్ కాదు.. సాధారణంగా పద సంపత్తికి సంబంధించిన పజిల్స్‌నైతే పెద్దలు ఈజీగా సాల్వ్ చేసేయగలరు. అదే వాటిని పిల్లలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. ఈ ఫోటో పజిల్స్ అలా కాదు.. అందరినీ మభ్యపెడతాయి. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా.. రహస్యాలను అస్సలు బయటకు రానివ్వవు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని ఓసారి లుక్కేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను ఓసారి చూశారా.? ఠక్కున అందరూ అక్కడున్నది ‘9’ అంకె అని చెప్పేస్తారు. అన్ని వరుసల్లోనూ ఆ నెంబర్ ఉందని గుక్కతిప్పుకుని మాట్లాడతారు. అదే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అందులో ‘8’ నెంబర్ కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. కేవలం 10 సెకన్లు టైం. ఫోటోను పైపైన చూస్తే కనిపించదు. తీక్షణంగా చూసి గుర్తించాలి. అది కూడా మీరు మేధావులైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రయత్నించండి. మరి లేట్ ఎందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టండి. ఒకవేళ ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి.