Viral Video: పిల్లలపై కన్ను.. గద్దను చీల్చిచెండాడిన కోడి.. వీడియో చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..

అమ్మ ప్రేమకు మరేది సాటిరాదు. కన్నబిడ్డల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. కేవలం మనుషులలలో మాత్రమే కాదు.

Viral Video: పిల్లలపై కన్ను.. గద్దను చీల్చిచెండాడిన కోడి.. వీడియో చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..
Viral Video

Updated on: Apr 06, 2022 | 9:28 AM

అమ్మ ప్రేమకు మరేది సాటిరాదు. కన్నబిడ్డల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. కేవలం మనుషులలలో మాత్రమే కాదు.. జంతువులలోనూ మాతృప్రేమకు కొలమానం లేదు. తన బిడ్డల దగ్గరకు వస్తే ఎంతటి ప్రమాదకరమైన జంతువులతో ప్రాణాలకు తెగించి పోరాడుతాయి. ఓ కోడి తన పిల్లలను కాపాడుకోవడం కోసం డేగతో విరోచిత పోరాటం చేసింది. తన పిల్లల కోసం వచ్చిన గద్దతో భయంకరంగా పోరాడి రక్షించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా గద్దలు పక్షులలోనే అత్యంత పెద్దవి.. ప్రమాదకరమైనవి. దాదాపు 6 కిలోల బరువును సైతం సులభంగా ఆకాశంలోకి ఎత్తేస్తాయి. ఎలుకలు, కుందేళ్లు, ఉడుతలను వేటాడుతుంటాయి. గద్ద వేటకు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. నేలపై ఉన్న కోడి పిల్లలను చూసి ఓ గద్ద అమాంతంపై భూమిపైకి చేరింది. ఆ కోడి పిల్లలను పట్టుకునేందుకు వాటి దగ్గరకు చేరుకునేలోపు.. అక్కడే ఉన్న తల్లి కోడి గద్దకు ఎదురెళ్లింది. ఆ గద్దను కాళ్లతో పట్టుకుని మెడను నోటితో పట్టుకుని నెలకేసి కొట్టింది. దీంతో ఆ గద్ద ప్రాణం పోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Also Read: Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..

Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..

Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..

Viral Video: వధూవరులకు స్టేజ్ పైనే షాకిచ్చిన స్నేహితులు.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు.. వీడియో వైరల్..

Loading...
Unable to load recommendations.
Follow Us