SUVs Gift: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్.. దీపావళికి కంపెనీ బంపర్ ఆఫర్!

SUV Diwali Gift: దీపావళికి కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు ఇస్తుంటాయి. హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ నలుగురు ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల పనితీరు, అంకితభావాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. MITS హెల్త్‌కేర్ సంస్థ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

SUVs Gift: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్.. దీపావళికి కంపెనీ బంపర్ ఆఫర్!
Haryana Pharma Company Gifts Employees Kia Sonet Suvs Ahead Of Diwali

Updated on: Oct 28, 2026 | 7:32 AM

SUV Diwali Gift: దీపావళికి కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు ఇస్తుంటాయి. హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ నలుగురు ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల పనితీరు, అంకితభావాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. MITS హెల్త్‌కేర్ సంస్థ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

నలుగురికి కియా సోనెట్ ఎస్‌యూవీలు

MITS గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎంకే భాటియా తన సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కొత్త కియా సోనెట్ SUVలను అందించారు. ఉద్యోగుల కష్టాన్ని, పనితీరును, నిబద్ధతను గుర్తించి  బహుమతులు అందించారు.  కార్లను అందించే కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్ల షోరూమ్‌లో నాలుగు కొత్త ఎస్‌యూవీలను నల్లటి వస్త్రాలతో కప్పి ఉంచారు. అనంతరం ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఆ వస్త్రాలను తొలగించి తమకు వచ్చిన కార్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు.  కార్యక్రమానికి కంపెనీ ఛైర్మన్ ఎంకే భాటియా బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాండ్ లిమోసిన్ కారులో వచ్చారు. ఉద్యోగులు కొత్త కార్లను ఆవిష్కరించడంతో అక్కడ సందడి నెలకొంది. సహోద్యోగులు చప్పట్లు కొడుతూ వారిని అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి, డ్యాన్సులు చేస్తూ వేడుకను జరుపుకున్నారు.

ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగికి గుర్తింపు

ఈ బహుమతులకు ఎంపికైన ఉద్యోగుల్లో ఒకరు ఐదేళ్లుగా MITS హెల్త్‌కేర్‌లో పనిచేస్తున్నారు. సంస్థలో ఉద్యోగుల పనితీరు, అంకితభావం, విధుల పట్ల నిబద్ధతను గుర్తించేందుకు యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్లను పూర్తిగా ఉచితంగా ఇచ్చారా అంటే లేదు. కంపెనీ SUV వాహనాలకు అవసరమైన డౌన్ పేమెంట్‌ను చెల్లించింది. మిగిలిన మొత్తానికి సంబంధించిన నెలవారీ వాయిదాలను ఉద్యోగుల జీతాల నుంచి సర్దుబాటు చేస్తారు. కార్లను సంబంధిత ఉద్యోగుల పేర్లపై రిజిస్టర్ చేసారు.

ఉద్యోగులందరికీ కారు గెలుచుకునే అవకాశం

సంస్థలో కనీసం 18 నెలలుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కూడా కల్పించింది MITS హెల్త్‌కేర్.  ఉద్యోగి హోదాతో సంబంధం లేకుండా సిబ్బందికి అవకాశం కల్పిస్తున్నారు. సెక్యూరిటీ గార్డుల నుంచి సీనియర్ అధికారుల వరకు అర్హులైన ఉద్యోగులు ఈ డ్రాలో పాల్గొనవచ్చు. తద్వారా మరింత మంది ఉద్యోగులకు కారును గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

గతంలోనూ 15 మందికి కార్లు బహుమతిగా

MITS హెల్త్‌కేర్ సంస్థ ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2024 దీపావళి సందర్భంగా 15 మంది ఉద్యోగులకు కార్లను అందించింది. ఆ సమయంలో టాటా పంచ్, మారుతి సుజుకి, గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలను బహుమతిగా ఇచ్చారు.సాధారణంగా పండుగల సమయంలో బోనస్‌లు, ఇతర బహుమతులు అందుకునే ఉద్యోగులకు ఏకంగా కార్లు అందించడం ప్రత్యేకంగా నిలిచింది. ఉద్యోగుల కష్టానికి గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఇతర సిబ్బందిని కూడా మెరుగైన పనితీరు కనబరిచేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.

Loading...
Unable to load recommendations.
Follow Us