Viral Video: ఇదేం పనిరా నీచుడా.. పానీపూరి నీటిలో ఏం కలిపాడో చూడండి.! ఛీ.. ఛీ.!

|

Aug 23, 2021 | 9:03 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మంచైనా..

Viral Video: ఇదేం పనిరా నీచుడా.. పానీపూరి నీటిలో ఏం కలిపాడో చూడండి.! ఛీ.. ఛీ.!
Panipuri
Follow us on

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మంచైనా.. చెడు అయినా.. నెటిజన్లు రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అసహ్యించుకుంటారు. మరి లేట్ ఎందుకు అదేంటో చూసేద్దాం పదండి.!

స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పానీపూరి అంటే లొట్టలేసుకుని తింటుంటారు. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియోను చూస్తే మాత్రం ఇక చస్తే .. పానీపూరి తిననని ఒట్టేసుకుంటారు. పానీపూరీ అమ్మే ఒక వ్యక్తి తన మూత్రాన్ని ఒక మగ్గులో పట్టి మసాలా పానీపూరి నీటిలో కలిపేశాడు. తనను ఎవరూ చూడటం లేదని అతను అనుకున్నాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం సైలెంట్‌గా ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఈ జిగుప్స కలిగించే ఘటన గౌహతిలో జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి తన మూత్రాన్ని పానీపూరిలో కలపడం స్పష్టంగా చూడవచ్చు. ఈ వీడియోను చూస్తున్నవారంతా పానీపూరి వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారట! పానీపూరి అమ్ముకునేవారంతా ఇలాంటి నీచమైన పనులు చేస్తారని కాదు ఈ ప్రబుద్ధుడి కారణంగా అందరూ మాటపడాల్సి వస్తుంది.