Watch: 8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం.. షాకింగ్‌ వీడియో చూస్తే..

|

Jan 11, 2025 | 12:58 PM

ఈ ఘ‌ట‌నపై స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఆ చిన్నారికి ఎలాంటి అనారోగ్య కార‌ణాలు లేవు. శుక్ర‌వారం ఉద‌యం ఆ పాప కుర్చీలో కూర్చుని ప్రాణాలు విడిచింద‌ని తెలిపారు. చిన్నారి త‌ల్లిదండ్రులు ముంబైలో ఉంటున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బిడ్డ మ‌ర‌ణ వార్త తెలుసుకున్న త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా విల‌పించారు.

Watch: 8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం.. షాకింగ్‌ వీడియో చూస్తే..
Heart Stroke
Follow us on

హార్ట్‌ ఎటాక్‌.. గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం ప్రజల్ని హడలెత్తిస్తోంది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే వస్తుందని భావించే గుండెపోటు.. ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలను సైతం బలితీసుకుంటోంది. చిన్నారులు సైతం గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం అందరినీ కలచివేస్తోంది. తాజాగా అలాంటి విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. స్కూల్‌లో క్లాస్‌ రూమ్‌లోకి వెళ్తు్న క్ర‌మంలో ఆ చిన్నారి ఉన్నట్టుండి కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో శుక్ర‌వారం ఉద‌యం చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

గుజరాత్‌లోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక తన తరగతి గదికి వెళుతున్నప్పుడు, లాబీల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది. క్ష‌ణాల్లోనే చైర్‌లోనే కుప్ప‌కూలిపోయింది. ఈ విష‌యాన్ని అక్క‌డున్న విద్యార్థులు, టీచ‌ర్లు గ‌మ‌నించారు. కాసేప‌టి త‌ర్వాత విద్యార్థిని కుప్ప‌కూలిపోవ‌డాన్ని గ‌మ‌నించిన ఓ టీచ‌ర్ సీపీఆర్ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘ‌ట‌నపై స్కూల్ ప్రిన్సిపాల్ ష‌ర్మిష్ట సిన్హా మాట్లాడుతూ.. ఆ చిన్నారికి ఎలాంటి అనారోగ్య కార‌ణాలు లేవు. శుక్ర‌వారం ఉద‌యం ఆ పాప కుర్చీలో కూర్చుని ప్రాణాలు విడిచింద‌ని తెలిపారు. చిన్నారి త‌ల్లిదండ్రులు ముంబైలో ఉంటున్న‌ట్లు పోలీసులు తెలిపారు. బిడ్డ మ‌ర‌ణ వార్త తెలుసుకున్న త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా విల‌పించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి