Viral Video: చిన్నారి బాలిక సైకిల్ మీద స్టంట్స్.. సర్కస్ ఫీట్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

పిల్లలలో దాగున్న ప్రతిభ కూడా బయటకు వస్తోంది. కొందరు తన గాత్రంతో అలరిస్తే.. మరికొందరు డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. భిన్నమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్నారుల వీడియో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Viral Video:  చిన్నారి బాలిక సైకిల్ మీద స్టంట్స్.. సర్కస్ ఫీట్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..
Girl Stunt Video

Updated on: Jun 05, 2023 | 9:33 AM

ఈ ప్రపంచంలో తరచి చూడాలే కానీ ప్రతిభావంతులకు కొదవలేదు. సోషల్ మీడియా యుగంలో మొదలైన తర్వాత దేశం నలుమూలల నుంచి పెద్దవాళ్లలో ఉన్న ప్రతిభ మాత్రమే కాదు.. పిల్లలలో దాగున్న ప్రతిభ కూడా బయటకు వస్తోంది. కొందరు తన గాత్రంతో అలరిస్తే.. మరికొందరు డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. భిన్నమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్నారుల వీడియో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన తర్వాత.. మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు.

ప్రస్తుతం పిల్లల నుంచి యువత వరకు స్టంట్ క్రేజ్ మోజులో పడ్డారు. స్టంట్స్ చేస్తూ యూత్ రీల్స్ చేస్తూ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ విష‌యంలో పిల్ల‌లు కూడా వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. చిన్న వయసులో కూడా డేంజరస్ స్టంట్స్ చేయడానికి వెనుకాడ కుండా ఎంతటి అభిరుచిని వెల్లడిస్తున్నారు. అయితే స్టంట్స్ చేస్తున్న సమయంలో తగిన అభ్యాసం అవసరం. ప్రస్తుతం ఒక స్టంట్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక చిన్నారి సైకిల్‌పై విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి బాలిక ఖాళీ రోడ్డులో  సైకిల్‌ తొక్కుతూ సర్కస్ విన్యాసాలు చేస్తూ కనిపిస్తోంది. సైకిల్ తొక్కుతున్న చిన్నారి ఆ సైకిల్ సీటు మీద నుంచి లేచి.. సైకిల్ టైర్‌పై నిలబడింది. తర్వాత ఒక ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్ వలె.. సైకిల్ ముందు చక్రాన్ని బొంగరంలా సర్కిల్‌లలో తిప్పడం ప్రారంభించింది. ఇంకా చెప్పాలంటే చిన్నారి సైకిల్ మీద డ్యాన్స్  చేస్తున్న తీరు చూస్తే..  సర్కస్ లో నిపుణులు చేస్తున్న విన్యాసాలు అనిపిస్తాయి.

ఈ వీడియోను @TansuYegen అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు మూడు లక్షల మందికి పైగా  చూశారు. ఒక వినియోగదారు ఈ స్టంట్ నిజంగా ప్రమాదకరమని కామెంట్ చేయగా.. చిన్నారి బాలిక భలే చేసిందే అని మరొకరు కితాబు ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us