Video: అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!

Indian Railways Viral Video: ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @Razanagnostic అనే ఖాతా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వీడియోకు పెట్టిన క్యాప్షన్ చూస్తే తెగ నవ్వేస్తుంటారు. ప్యాసింజర్ ట్రైన్‌ బోగి ముందు ఇద్దరు మహిళలు చేసిన ఓ పనికి అంతా నవ్వుకుంటున్నారు.

Video: అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Indian Railways Viral Video
Image Credit source: https://x.com/Razanagnostic/status

Updated on: Jun 05, 2026 | 7:44 AM

Indian Railways Viral Video: భారతీయ రైల్వే స్టేషన్లలో రోజూ ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లకు కడుపుబ్బా నవ్విస్తోంది. రైలు ఎక్కేందుకు ఉన్న చిన్న తలుపు గుండా ఒక భారీ పార్సిల్‌ను లోపలికి నెట్టడానికి ఇద్దరు మహిళలు పడిన తిప్పలు, ఆ తర్వాత అందులో ఓ మహిళ చేసిన పని చూస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు.

డోర్ చిన్నది.. సామాన్ పెద్దది.. అయినా తగ్గని ప్రయాణికులు!

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అక్కడ ఇద్దరు మహిళలు ఒక భారీ కార్టన్ బాక్స్‌ను జనరల్ బోగీలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ పక్కనే ఉన్న కొంతమంది ప్రయాణికులు కూడా ఆ మహిళలకు సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ రైలు తలుపు చాలా ఇరుకైనది, కానీ వారు ఎక్కించాలనుకున్న పెట్టె మాత్రం చాలా పెద్దది. అయినా సరే మనవాళ్లు అస్సలు తగ్గలేదు. ‘పట్టర పట్టు’ అనుకుంటూ ఆ పెట్టెను అడ్డంగా, నిలువుగా, వంకరగా ఎలాగైనా లోపలికి తోసేయాలని గట్టిగా ప్రయత్నించారు. వాళ్లంతా కలిసి పూర్తి శక్తితో నెట్టినా ఆ పెట్టె అంగుళం కూడా కదల్లేదు. ఈ హడావుడి చూసి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న మిగతా ప్రయాణికులు కూడా అక్కడే ఆగి వింతగా చూడటం మొదలుపెట్టారు.

ఇక లాభం లేదనుకుని..

ఎంత ప్రయత్నించినా, రకరకాల ఐడియాలు వేసినా ఫలితం శూన్యమైంది. అందరూ అలసిపోయి, ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్న తరుణంలో కథలోకి ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకామె రైలు నుంచి కిందకు దిగి వచ్చి ఏమాత్రం సమయం వృథా చేయకుండా, ఒంటిచేత్తో ఆ భారీ పెట్టెను ఎత్తి తన తలపై పెట్టుకుంది. అంతే, చాలా కూల్‌గా ఆ బరువైన సామానును తలపై మోస్తూ ప్లాట్‌ఫారమ్ మీదుగా ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఈ క్లిప్ చూసిన నెటిజన్లు “వుమెన్ పవర్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!

ఏనుగునైనా రైల్లోకి తోసేస్తారేమో.. క్యాప్షన్‌కు నెటిజన్లు ఫిదా!

ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @Razanagnostic అనే ఖాతా ద్వారా పంచుకున్నారు. దీనికి పెట్టిన క్యాప్షన్ కూడా వీడియో అంతకంటే వైరల్ అవుతోంది. “మన దేశంలో ఎంతటి మహానుభావులు ఉన్నారంటే.. వీరికి గనుక అవకాశం ఇస్తే సాక్షాత్తూ ఆ ఏనుగును కూడా రైలు బోగీలోకి తోసేస్తారు!” అంటూ సరదాగా రాసుకొచ్చారు. ఈ ఫన్నీ క్యాప్షన్ ఇంటర్నెట్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకోవడంతో వీడియో క్షణాల్లో వేల సంఖ్యలో షేర్లు సంపాదించుకుంది. ఒక యూజర్ స్పందిస్తూ.. “అయ్యా.. అది మనుషులు కూర్చునే ప్యాసింజర్ రైలు, సామాన్లు తీసుకెళ్లే గూడ్స్ రైలు కాదు.. కాస్త చూసుకోండి” అని నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేయగా, మరొకరు “చివర్లో ఆ అక్క వచ్చి మగాళ్ల ఈగోను దారుణంగా దెబ్బతీసింది, ఆమెకు శాల్యూట్” అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us