Funny Video: యజమానితో కలిసి ఈ శునకాలు ఏం చేశాయో తెలిస్తే.. ఆశ్చర్యపోవల్సిందే..

సాధారణంగా పెంపుడు కుక్కలు తమ యజమానులతో ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వారి కుటుంబంలో సభ్యుల్లా మారిపోతాయి. అంతేకాదు తమ యజమాని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి. వాటికి చిన్నప్పటినుంచి ఏది నేర్పించినా..

Funny Video: యజమానితో కలిసి ఈ శునకాలు ఏం చేశాయో తెలిస్తే.. ఆశ్చర్యపోవల్సిందే..
Dogs Skiping
Follow us

|

Updated on: Oct 23, 2022 | 10:03 PM

సాధారణంగా పెంపుడు కుక్కలు తమ యజమానులతో ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వారి కుటుంబంలో సభ్యుల్లా మారిపోతాయి. అంతేకాదు తమ యజమాని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాయి. వాటికి చిన్నప్పటినుంచి ఏది నేర్పించినా వెంటనే నేర్చుకుంటాయి. తాజాగా ఓ నాలుగు కుక్కపిల్లలు తన యజమానితో కలిసి ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి వ్యాయామంలో భాగంగా ఉదయాన్నే స్కిప్పింగ్‌ ఆడుతున్నాడు. అక్కడికి చేరిన మూడు కుక్కపిల్లలు అతనితో కలిసి స్కిప్పింగ్‌ ఆడుతున్నాయి. అతను తాడు వాటి మీదుగా వేస్తుంటే ఎంతో చాకచక్యంగా అవి ఆ తాడుమీదనుంచి జంప్‌ చేస్తున్నాయి. ఇదంతా గమనిస్తూ అక్కడే ఉన్న మరో కుక్కపిల్ల నేనూ ఆడతాను.. అంటూ పరుగెత్తుకుని వాళ్ల దగ్గరకి చేరింది. అదికూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి స్కిప్పింగ్‌ ఆడింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటుంది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ కుక్కపిల్లలు అలా ఎగురుతుంటే తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. సో క్యూట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు తమ యజమానులతో కలిసి బంతి ఆట ఆడటం, యజమాని చెప్పిన దానికి తన స్టైల్స్ లో రిప్లై ఇవ్వడం ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాం. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఈ వీడియోలో కుక్కపిల్లలు మాత్రం తన యజమాని ఏం చేస్తున్నాడో చూసి దానిని అనుసరించడం భలే నవ్వు తెపిస్తోంది. ముఖ్యంగా పెంపుడు జంతువుల యజమాని బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోతాడు. కాని తనతో పాటు తన కుక్కపిల్లలతో కూడా స్కిప్పింగ్ చేయిస్తూ.. బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటం కొసమెరుపు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పటి నుంచి తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు