అంకితభావంతో ఆడితేనే గెలుపు..! ఫ్రైడే ఫీలింగ్ అంటూ వీడియోని పోస్ట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

నిబద్ధతతో, పూర్తి ఎఫర్ట్ తో ప్రయత్నించాలని పరోక్షంగా ఆయన మెసేజ్ ఇచ్చారు. ‘ఫ్రైడే ఫీలింగ్’ అనే హాష్ ట్యాగ్ ను జత చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మహీంద్రా మెచ్చిన ఆ స్ఫూర్తిదాయక వీడియోను మీరూ చూసేయండి.

అంకితభావంతో ఆడితేనే గెలుపు..!  ఫ్రైడే ఫీలింగ్ అంటూ వీడియోని పోస్ట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా
Anandh Mahindra

Updated on: Mar 31, 2023 | 7:09 PM

Anand Mahindra: ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తరచూ అనేక స్పూర్తిదాయకమైన పోస్ట్‌లు పెడుతుంటారు ఆనంద్‌ మహీంద్రా. పలు సందర్భాల్లో నెటిజన్లు వేసిన ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తుంటారు. ఇంకా పలు సందర్బాల్లో మనల్ని ఆలోచింపజేసే పోస్ట్‌లు పెడుతుంటారు. ఆటలు, పాటలు, జూగాడు చర్యలకు సంబంధించి ఆనంద్‌ మహీంద్రా పెట్టే పోస్టులు నెటిజన్లకు ఎంతగానో నచ్చుతాయి. తాజాగా ఆయ‌న ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌గా మారిన వీడియోలో టీ20 మ్యాచ్ లో బౌండరీ లైన్ చివరిలో బంతిని ఆపేందుకు మహిళా క్రికెటర్ చేసిన ప్రయత్నం అందులో కనిపించింది. బంతి వెంట బౌండరీ దాకా పరిగెత్తిన ఆమె.. ఫోర్ వెళ్లకుండా ఆపేందుకు చేసిన విన్యాసం నిజంగా అద్భుతంగా ఉంది. అదే మహీంద్రాని అబ్బురపరిచింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్వీట్ చేసిన ఆయన.. మీరు ఆడేందుకు వెళ్తుంటే.. మీ దగ్గర ఉన్న ఎఫర్ట్ అంతా పెట్టండి. సగం చర్యలు సరిపోవు అని క్యాప్షన్ ఇచ్చారు. నిబద్ధతతో, పూర్తి ఎఫర్ట్ తో ప్రయత్నించాలని పరోక్షంగా ఆయన మెసేజ్ ఇచ్చారు. ‘ఫ్రైడే ఫీలింగ్’ అనే హాష్ ట్యాగ్ ను జత చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మహీంద్రా మెచ్చిన ఆ స్ఫూర్తిదాయక వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us