ఆ పార్క్‌లో రోజూలాగే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఇక జాగింగ్ చేసి అలిసిపోయిన కొందరు ఓ చెట్టు నీడలో సేద తీరాలని అనుకున్నారు. అక్కడికి వెళ్లి పైకి తలెత్తారో.? లేదో.? ఎదురుగా షాకింగ్ సీన్ కనిపించింది. అంతే వారికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైయింది. చెట్టుపైన 11 అడుగుల భారీ పైథాన్ వేలాడుతూ కనిపించింది.
సాధారణంగా పాము, కొండచిలువను ఆమడదూరం నుంచి చూస్తేనే మనం దడుసుకుంటాం. అలాంటిది అవి మన పక్కన ఉంటే.. ఇంకేమైనా ఉందా.? ఆ ఊహకే నరాలు తెగిపోతాయి. ఇలాంటి సీన్ తాజాగా బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని బెంజసిరి పార్క్ మార్గంలో ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న కొంతమంది వ్యక్తులకు చెట్టుపైన 11 అడుగుల భారీ పైథాన్ వేలాడుతూ కనిపించింది. అదెక్కడ మీద పడుతుందోనని భయపడిన వాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ పామును పట్టుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా.. ఆ చెట్టుకు ఎదురుగా ఉన్న భవనంపైకి ఎక్కి పామును చాకచక్యంగా పట్టుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!
Also Read:
గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!
చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!