Shocking Video: రెండు మొసళ్ల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే హడలిపోతారు..

|

Aug 18, 2023 | 9:29 AM

మొసలి చాలా ప్రమాదకరమైన జంతువు. నీటిలో దీనితో పోటీ పడటం అంత సులభం కాదు. అనేక సందర్భాల్లో నీటిని దాటుతున్న జంతువులపై మొసళ్లు దాడి చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. అయితే, మొసళ్లు ఇతర జంతువులపైనే కాదు.. తమలో తాము కూడా దాడులు చేసుకుంటాయి. ఒక మొసలి, మరో మొసలిపై దాడి చేసి చంపి తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక మొసలి మరొక మొసలిపై దాడి చేస్తోంది. భయానకంగా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Shocking Video: రెండు మొసళ్ల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే హడలిపోతారు..
Crocodile Fighting
Follow us on

Viral Video: మొసలి చాలా ప్రమాదకరమైన జంతువు. నీటిలో దీనితో పోటీ పడటం అంత సులభం కాదు. అనేక సందర్భాల్లో నీటిని దాటుతున్న జంతువులపై మొసళ్లు దాడి చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. అయితే, మొసళ్లు ఇతర జంతువులపైనే కాదు.. తమలో తాము కూడా దాడులు చేసుకుంటాయి. ఒక మొసలి, మరో మొసలిపై దాడి చేసి చంపి తిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక మొసలి మరొక మొసలిపై దాడి చేస్తోంది. భయానకంగా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మొసళ్లకు రక్త దాహం వేసిందా ఏంటి?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, మొసళ్లు రెండూ ఒకదానిపై ఒకటి ప్రమాదకరంగా దాడి చేసుకుంటున్నాయి. వీడియో చూస్తే ఆ రెండు మొసళ్లు రక్త దాహంతో కొట్టుమిట్టాడుతున్నట్లుగా అనిపిస్తుంది. భయంకరమైన మొసళ్లు రెండూ ఒకదానికొకటి తీవ్ర కోపంతో పోరాడుతున్నాయి.

దాడి సమయంలో, మొసళ్ళు రెండూ తమ పళ్ళతో ఒకదాని శరీరాన్ని మరొకటి చీల్చే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ పోరులో ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఒకటి తోకను పట్టుకుంటే.. మరొకటి తను పట్టుకుంటూ భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేశాయి.

అలసి, సొలసి.. విరామం తీసుకున్న మొసళ్లు..

అయితే, కాసేపటి వరకు బీభత్సంగా పోరాడిన రెండు మొసళ్లు.. ఆ తరువాత చల్లబడ్డాయి. దేనిని ఏది తింటుందో అనే ఉత్కంఠకు తెరదించి రెండూ ప్రశాంతంగా నది ఒడ్డున సేద తీరాయి. ఇంతలో ఒక మొసలి నీటిలోకి వెళ్లగా.. మరొకటి ఒడ్డులో దొర్లుతూ ఉండిపోయింది. అయితే, వీటి పోరు, ఆ తరువాత జరిగిన పరిణామాలు చూసి షాక్ అయ్యారు ఆ పక్కనే ఉన్న వ్యక్తులు.

కాగా, మొసళ్లకు ఆహారం వేసేందుకు వెళ్లగా.. ఆ రెండు మొసళ్లు బయటకు వచ్చాయి. ఆ సమయంలోనే రెండూ భీకరంగా పోట్లాడుకున్నాయి. ఆహారం కోసం పోట్లాడుకుంటున్నాయేమో అనుకుంటే.. చివరకు అవి ట్విస్ట్ ఇచ్చాయి. అయితే, ఈ ఘటనను అంతా సదరు వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. దీనిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొసళ్ల పోరుపై రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..