Viral News : పెంపుడు కుక్కతో సరదాగా ఆడాడు.. మాంచి స్పీడ్‌మీదున్న ఆ కుక్క యజమాని పూసాలు కదిలించింది..

|

Jul 16, 2021 | 10:46 PM

Viral News : జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే అదో రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుందట.

Viral News : పెంపుడు కుక్కతో సరదాగా ఆడాడు.. మాంచి స్పీడ్‌మీదున్న ఆ కుక్క యజమాని పూసాలు కదిలించింది..
Dog
Follow us on

Viral News : జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే అదో రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుందట. వీటిల్లో కుక్కులదే ప్రథమ స్థానమని చెప్పుకోవచ్చు. అవెప్పుడూ ఆహ్లాదాన్ని అందించడం కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్నాడు. అయితే, ఈ ఆట పీక్స్‌కి చేరి.. మరీ ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యింది. దాని ఎగ్జైట్‌మెంట్ కారణంగా కుక్క యజమాని దారుణమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేశాడు.

వివరాల్లోకెళితే.. అమెరికాలోని మైనెలో ఉండే డెక్లాన్ కు జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారులో నుంచి బయటకు దిగుతూ.. తన కుక్క పట్టుకోవడానికి కట్టె విసిరాడు. యజమాని విసిరిన కట్టెను పట్టుకోవడం కోసం అది పరిగెత్తింది. సరిగ్గా కుక్క పరిగెత్తే సమయంలోనే డోర్ తెరిచి కారు దిగాడు డెక్లాన్‌. కట్టె కోసం పరుగెడుతున్న కుక్క కారు దిగుతున్న డెక్లాన్ కాళ్లకు అడ్డం పడింది. దాంతో డెక్లాన్ కిందపడిపోయాడు. అనూహ్యమైన ఈ సంఘటనలో డెక్లాన్ తలకు గట్టి దెబ్బతగిలింది. అతను లేచి నిలబడ్డానికి చాలా తంటాలు పడ్డాడు పాపం. లేచాక హమ్మయ్య అని చూస్తుండగా కట్టెముక్కను తీసుకొచ్చి మళ్లీ విసరమంటూ నిల్చొంది ఆ కుక్క. కాగా, డెక్లాన్ కొద్దిపాటి గాయాలతో క్షేమంగా బయటపడ్డాడని, ఎటువంటి ప్రమాదం లేదని వీడియో పోస్టు చేసిన వ్యక్తి తెలిపాడు.

ఇక వీడియో చూసిన నెటిజన్లు కుక్కను హ్యాండిల్ చేయడం అంత వీజీ కాదంటూ సూచనలిస్తూనే, ఆ కుక్కను తిట్టిపోస్తున్నారు. మరొకరేమో తనకు కూడా కుక్కలతో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ అయిందని, క్రికెట్, టెన్నిస్ ఆడిస్తే బంతి ఎక్కడ పడినా తీసుకొచ్చి ఇస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఫన్నీ వీడియోను మీరూ చేయండి.

Viral Video:

Also read:

CM KCR: ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్..

South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. 19వ తేదీ నుంచి సాధారణ రైళ్లన్నీ పునరుద్ధరణ.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Mobiles: ఆపిల్‌ సంస్థకు షియోమీ షాక్‌.. ఆపిల్‌ని వెనక్కి రెండో స్థానాన్ని ఆక్రమించేసింది.. మొదటి స్థానం ఏ కంపెనీ అంటే..